భారత్‌పై కొత్త కుట్రలు జరుగుతున్నాయా?

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలు బీజేపీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. అన్నదాతలు తమ డిమాండ్లు నెరవేర్చాలని వేలాదిగా రోడ్డెక్కారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు వీరిపై దాడులు చేస్తున్నారు. అయితే తీవ్రవాద భావజాలం ఉన్నవారు కార్మిక సంఘాల్లో చేరారా అనే సందేహాలు పలువురు లేవనెత్తుతున్నారు.

సాధారణంగా నక్సల్స్ సంఘాలను ఇప్పటి వరకు మనం చూశాం. ఇప్పుడు టెర్రరిస్ట్ సంఘాలు కూడా ఉండబోతున్నాయా.  లేకపోతే మత మూర్ఖత్వం కార్మిక సంఘాల్లో ఆరంభమైందా అని పలువురు విశ్లేషకులు తమ సందేహాలను లేవనెత్తుతున్నారు. దిల్లీ అల్లర్ల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  వీరే రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు అన్నదాతల చేత నిరసనలు చేపిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే హమాస్ తీవ్రవాదులను మట్టు పెట్టేందుకు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్ పై పోరులో ఆది నుంచి ఇజ్రాయెల్ కు భారత్ మద్దతుగా ఉంది.  గాజాపై దాడులను పలు ముస్లిం దేశాలు ఖండించినా.. భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు పాలస్తీనా కు మద్దతుగా నిలిచినా మోదీ తన వైఖరిని మార్చుకోలేదు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ కు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఆ దేశానికి భారత్ ఆయుధ గారం నుంచి డ్రోన్లను అందిస్తున్నారు. ఇవి మన దగ్గర నుంచి ఇజ్రాయెల్ వెళ్లాలంటే షిప్ ల్లోనే వెళ్లాలి. కాకపోతే ఆ డ్రోన్లను మేం షిప్పుల్లో లోడ్ చేయమని కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘం అల్టీమేటం జారీ చేసింది. అంటే వీరు పాలస్తీనాకు అందులోని హమాస్ కు మద్దతు పలుకుతున్నట్లే లెక్క.  వీరంతా ఇప్పుడు తీవ్రవాదంపై పోరు సాగిస్తున్న నరేంద్ర మోదీకి సవాల్ విసురుతున్నారు. మరి వీటిని ప్రధాని ఎలా తిప్పికొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: