ఇంటలిజెన్స్‌ రిపోర్ట్‌: జగన్‌ ప్రాణాలకు ముప్పు ఉందా?

సీఎం జగన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు హెలికాప్టర్లు కొనుగోలు చేసింది. ఇందుకు సర్కారు చూపించిన కారణాల్లో సీఎంకు మావోయిస్టులు, టెర్రరిస్టులు, వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగులు, సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇవ్వడం ఒకటిగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలని పేర్కోంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ సిఫార్సు చేశారు. సీఎంకు మావోయిస్టులు, టెర్రరిస్టులు, వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగులు, సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చింది.

సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉన్నందున ప్రయాణాల్లో సునిశితంగా వ్యవహరించాల్సి ఉందని ఇంటెలిజెన్స్ డీజీ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న  భెల్ హెలికాప్టర్ 2010 నుంచి వినియోగిస్తున్నందున తక్షణం మార్పు చేయాలని ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ కూడా చెప్పింది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యాధునిక రెండు భెల్ హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
రెండు ఇంజన్లు కలిగిన భెల్ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రతీ నెలా రూ.1.91 కోట్ల రూపాయలను హెలికాప్టర్ అద్దెగా చెల్లించటంతో పాటు ఇతర ఖర్చులనూ చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈమేరకు మౌలికసదుపాయాలు, పెట్టుబడుల కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం విజయవాడ, విశాఖపట్నంలలో వేర్వేరుగా రెండు హెలికాప్టర్లను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. లీజు ప్రాతిపదికన మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా హెలికాప్టర్స్ నుంచి విజయవాడ, విశాఖ విమానాశ్రయాల్లో రెండు వేర్వేరు హెలికాప్టర్లను మొహరించేలా నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్ల రూపాయల చొప్పున లీజు చెల్లించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: