కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఏం మాయ చేస్తారో?

బీఆర్ఎస్ అధినేత త్వరలోనే దిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తొలిసారి ఆయన దేశ రాజధాని బాట పట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత ఆయన కాలు జారి కిందపడటం.. తుంటి విరగడం వల్ల ఇప్పటి వరకు విశ్రాంతి తీసుకున్నారు.

అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య పొత్తు ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన దిల్లీ కి వెళ్తుండటంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దిల్లీ ఎవర్నీ కలుస్తారుదాని గురించి కూడా చర్చ జరుగుతోంది. దిల్లీలో కేసీఆర్ ఎవర్నీ కలుస్తారు అనే దానిపై ప్రస్తుతానికి అయితే స్పష్టత లేదు. ఏ ఎజెండాపై ఆయన వెళ్తున్నారు అనే విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది.

అయితే దీనిపై ఓ వర్గం నేతలు మరోలా అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ దిల్లీ వెళ్లడం వల్ల ఒరిగేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కేసీఆర్  ను పట్టించుకునే వారే కరవయ్యారు. ఇప్పటి వరకు ఇండియా కూటమిలో చేరుతారు అనే ఊహాగానాలు ఉండేవి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానికి చెక్ పడింది. ఇక థర్డ్ ఫ్రంట్ అనే ఊసే లేదు. ఇక కేసీఆర్ ను అటు బీజేపీ కానీ.. ఇటు కాంగ్రెస్ కానీ పట్టించుకోదు.

గతంలో కూడా ఆయన దిల్లీ వెళ్లిన సందర్భంలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన ఎయిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా అద్భుతాలేమీ జరిగే అవకాశం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై మైండ్ గేమ్ ఆడుతోంది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారం చేసి విజయవంతమైంది. ఇప్పుడు కూడా కేసీఆర్ అవినీతిపై విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో నే కేసీఆర్ దిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో కలుస్తారు అనే ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తద్వారా లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: