చంద్రబాబుకి వరుస షాక్‌లు ఇస్తున్న పవన్?

ఏపీలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య పలుమార్లు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశం ఉండటంతో మరికొద్ది రోజుల్లో తాము పోటీ చేసే సీట్లను ప్రకటించనున్నాయి.

ఉమ్మడి విశాఖ  జిల్లాలో జనసేన పోటీ చేయాలని ఉవ్విళూరుతోంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం  పార్టీ స్థాపించిన సమయంలో విశాఖ  జిల్లాలో నాలుగు సీట్లను గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కూడా తమకు సీట్లు కావాలని జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం.  అయితే పవన్ కల్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. అదే ఏ స్థాయిలో అంటే విశాఖలో పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులను ప్రకటించేశారు కూడా.

తమకు ఏ సీట్లు అయితే వస్తాయో వాటినే పవన్ కల్యాణ్ ప్రకటించారు అనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భీమిలికి ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్, గత ఎన్నికల్లో పవన్ పోటీ  చేసి ఓడిపోయిన గాజువాక నుంచి ఈసారి ఆయన పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఈ సారి ఇక్కడ నుంచి సుందరపు సతీశ్ బరిలో ఉంటారని సమాచారం. పెందుర్తి నుంచి పంచకర్ల రమేశ్. గతంలో కూడా ఈయన ఇదే స్థానం బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. యలమంచలి నుంచి సుందరపు విజయ్ కుమార్ ఇన్ఛార్జిగా ఉన్నారు.

జనసేన ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఈయనకు మెగా ఫ్యామిలీ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొత్తంగా ఈ నాలుగు సీట్లను పవన్ అనధికారికంగా ప్రకటించినట్లయింది. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో కూడా పవన్ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అయితే ఇది పవన్, చంద్రబాబు ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందంలో భాగమా.. లేదా అనేది త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: