పాపం పసివాళ్లు: వీళ్లేం టీచర్లు బాబోయ్?

రాబొయ్యే విద్యా సంవత్సరానికి ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి - ఏప్రిల్ నెలల్లో ఇంటర్వ్యూ , డెమో నిర్వహిస్తుంటారు. ఇంటర్వ్యూ కి వచ్చిన అభ్యర్థుల స్థాయి చాలా సార్లు దయనీయంగా ఉంటోంది. అది హైదరాబాద్ కావొచ్చు.. విజయవాడ, తిరుపతి కావొచ్చు.. పెద్దగా తేడా ఉండదు.. వంద మంది ఇంటర్వ్యూ కొస్తే అందులో యాభై మందికి  కనీసం నూటికి పది మార్కులు రావు . ముప్పై అయిదు దాటే  వారు పది శాతం మాత్రమే.

ఇక కొత్తగా డిగ్రీ పూర్తి చేసి ఇంటర్వ్యూ కొచ్చిన వారంటే ఏదో అనుకోవచ్చు. కానీ పది, పదహేనేళ్లుగా టీచర్స్ గా పని చేస్తున్నవారు అదీ పేరొందిన స్కూల్స్ లో పని చేస్తున్నవారు కూడాదయనీయమయిన స్థితిలో ఉంటున్నారు. ఆంగ్లంలో సరిగా మాట్లాడలేరు అంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ తెలుగు ఉపాధ్యాయులుగా  పనిచేస్తున్న వారు కూడా థె ల్ ఘు  అని పలికితే ఏం చెబుతాం. షా రద .. అంటూ తమ పేరును కూడా సరిగా పలక లేని వారు ఉన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ప్రైమరీ సైన్స్ టీచర్ పోస్ట్ కోసం వచ్చిన ఒక మహిళ.. ఆమె అయిదేళ్లుగా అక్కడే ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పని చేస్తోంది. "వాట్ ఈజ్  ఫోటోసింతేసిస్" అంటే "ప్లాంట్స్ క్రేయేట్ ఫుడ్ "అంటోంది.

ఇలాంటి వారు ఇంగ్లీష్ భాషను  చీల్చి చెండాడేస్తారు . అయ్యా!  హై స్కూల్ విద్యార్థులకు ఆంగ్లాన్ని  ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న ఒక అధ్యాపకుడు "చిల్డ్రన్స్ వెరీ మచ్ లైక్ మై టీచింగ్" అంటే ఏం చెప్పాలి. వడబోసి వడబోసి .. నాలుగు ఖాళీలనుభర్తీ చేయడానికి .. ఆరు ఆదివారాలు ఇంటర్వ్యూ చేసి .. అరవై- డెబ్భై శాతం సాధించిన వారిని ఎంపిక చేసి..  అటు పై వారికి ట్రైనింగ్ ఇచ్చి పాఠాలు చెప్పమంటే అప్పుడప్పుడు పిల్లలు ఆ టీచర్ చెప్పే పాఠం  అర్థం కాలేదు సార్ అంటుంటారు. ఇదీ నేటి విద్యాబోధన దుస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: