డేంజర్‌ గేమ్‌లోకి జగన్‌.. ఏమవుతుందో?

వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు చాలా చోట్ల అభ్యర్థులను మార్చారు. కొత్త ముఖాలను చోటు ఇచ్చారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను మరో నియోజవర్గానికి బదిలీ చేయడం బహుశా ఏపీలోనే జరిగింది ఏమో. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. కానీ రాజకీయాల్లో కూడా బదిలీలు ఉంటాయని సీఎం జగన్ ద్వారా తెలిసింది.

పెళ్లిలో అప్పగింతలు మనం చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ అప్పగింతలు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. చిలకలూరిపేట లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న విడుదల రజినీ ఇప్పుడు గుంటూరు నుంచి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆమె చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాద సభను ఏర్పాటు చేశారు. మరోవైపు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం టీడీపీ కార్యకర్తలతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ తరహా విచిత్రమైన అప్పగింత రాజకీయాలు నడుస్తున్నాయి.

తాజాగా కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు వాసులకు బైబై చెప్పి గుంటూరు కి చేరుకున్నారు. మాజీ మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. 2009లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన రెండోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించి బయట పడ్డారు. ఇప్పుడు అక్కడ అనీల్ కుమార్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే కారణంతో ఆయన్ను సీఎం జగన్ ఎంపీగా పోటీ చేయిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో నా వెంట ఉన్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు.  జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తా. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడికి వెళ్తా. నెల్లూరు సిటీ కి అభ్యర్థిగా మైనార్టీకి జగన్ అవకాశం కల్పించారు. మీరంతా కలిసి పనిచేసి ఆయన్ను గెలిపించుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: