చంద్రబాబు, మోదీ పొత్తు.. అసలు ట్విస్ట్‌ ఇదా?

చక్రాలను వ్యూహాత్మకంగా తిప్పగలిగిన నేత ఇప్పుడు తన చక్రాలను బీజేపీ వైపు ఎందుకు మరల్చారు. కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు. అదే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ప్రస్తుతం చంద్రబాబుకి తాడే పామై కరిచే పరిస్థితి. అందుకే బీజేపీ వద్దకు ఆయన వెళ్లాల్సి వస్తోంది అనేది విశ్లేషకుల వాదన.

ఒకప్పుడు దిల్లీకి వెళ్తే ఆహ్లాదకర వాతావరణంలో మీడియాతో మాట్లాడే ఆయన బీజేపీ అగ్ర నేతలతో సమావేశం అనంతరం మౌనంగా వెనక్కి వచ్చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్త చేస్తున్నారు.  చంద్రబాబు ఎన్డీయే కూటమిలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తాపత్రయ పడుతున్న నేపథ్యంలో  బీజేపీ గట్టి షరతులే పెడుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు చంద్రబాబుకి బీజేపీ తో అవసరం ఏంటంటే.. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి  వస్తుందని పలు సర్వే సంస్థలు తమ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

దీంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబుపై పలు రకాల కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీ తలచుకుంటే ఆయన్ను జైలుకు పంపగలదు. ఎందుకంటే ఇప్పటికే ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ చంద్రబాబుకి నోటీసులు జారీ చేసింది.  మహా అయితే ఇంకో రెండు, మూడు సార్లు నోటీసులు జారీ చేస్తుంది. దీనికి ఆయన హాజరై తన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

మరోవైపు విదేశాల్లో కూడా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది ఫెమా చట్టం కిందకి వస్తే ఆయనకు బెయిల్ కూడా రాదు. జైలుకి పంపడం ఆధారాలు చాలు. మరొకటి ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికలకు సీఎం జగన్ అధికార యంత్రాగాన్ని వాడతారు. దీనిని నియత్రించాలంటే కేంద్రం మద్దతు అవసరం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారుల్ని పక్కన పెట్టి.. తన మాట వినే అధికారుల్ని తెప్పించుకోవడం చంద్రబాబు వ్యూహం. దీంతో పాటు జగన్ కు కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం ఆపేయాలి. ఇన్ని కారణాల వల్లే చంద్రబాబు బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: