మోడీ, చంద్రబాబు పొత్తు.. ఆ ఇద్దరికీ చాలా అవసరం?

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ పదవి ఇచ్చి కేంద మంత్రిగా అవకాశం ఇచ్చారు. అటువంటి సుజనా చౌదరి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఈయనతో పాటు సీఎం రమేశ్ ఇతర ఎంపీలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని చంద్రబాబు దగ్గరుండి మరీ బీజేపీలోకి పంపించారు అనే కామెంట్ ఇప్పటికీ ఉంది. అయితే టీడీపీని అయిదేళ్లుగా బీజేపీకి దగ్గర  చేయాలని సుజనా, సీఎం రమేశ్ లు  ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ రెండు ముక్కలుగా విడిపోయింది అని చెప్పవచ్చు. ఒకటి సంప్రదాయ బీజేపీ క్యాడర్, రెండోది వలస నేతలు. ఈ రెండు వర్గాల మాత్రం విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఒంటరిగానే పోటీ కి వెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి సూచించింది. కానీ తప్పని పరిస్థితుల్లో జనసేనతో కలిసి వెళ్లాల్సి వచ్చింది.

అయితే ఎప్పటి నుంచో బీజేపీలో పాతుకుపోయిన వారు తమ పార్టీ సొంతంగా ఎదగాలని చూస్తారు.  ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి కానీ.. జాతీయ స్థాయిలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేశ్ లతో పాటు మరికొంత మంది ఇతర పార్టీ నుంచి వచ్చినవారే.  వీరికి పదవులు, అధికారం ముఖ్యం. ఏపీలో బీజేపీ బలపడాలంటే సుదూర వ్యూహం ఉండాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

ముందుగా కొన్ని స్థానాలు సంపాదిస్తే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు అనుభవించవచ్చు.  ప్రస్తుతం వీరే అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ తో కలసి వెళ్తే కొన్ని సీట్లైనా దక్కుతాయి. లేకుంటే గతంలో మాదిరిగా ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ కార్యవర్గం పొత్తు వద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే వారు మాత్రం జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఏది ఏమైనా వీరద్దరి కృషి ఫలించినట్లే కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప టీడీపీతో పొత్తు పొడవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: