టీడీపీ సీనియర్లకు చెక్‌ పెట్టబోతున్న చంద్రబాబు?

ఏపీలో పొత్తులకు వేళైంది. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల విషయమై బీజేపీతో చర్చించేందుకు దిల్లీకి పయనమయ్యారు. అమిత్‌షా, నడ్డాతో చర్చలు జరిపారు. మరోవైపు జనసేన, టీడీపీ ల మధ్య సీట్ల విషయమై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందన్న సమయంలో చంద్రబాబు దిల్లీ పర్యటన చర్చనీయాంశం అయింది.  దీంతో మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వస్తాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.  

అయితే అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంలో వైసీపీ అధినేత జగన్ ముందున్నారు. ఈ విషయంలో పవన్, చంద్రబాబులు వెనుక పడ్డారనే చెప్పొచ్చు.  ఇప్పుడు సీట్ల విషయం కొలిక్కివస్తున్న నేపథ్యంలో వైసీపీ అనుకూల మీడియా టీడీపీ సీనియర్లకు టికెట్లు ఇవ్వడం లేదు అని ప్రచారం చేస్తోంది. ఎవరితోనైనా దొంగాటలు ఆడగల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీ సీనియర్ నేతలకు టికెట్లు ఎగ్గొట్టడానికి తొండాట ఆడుతున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మరోసారి పావుగా వాడుతూ టీడీపీ సీనియర్ నేతలకు చెక్ పెడుతున్నారు. పవన్ ఒత్తిడి ఉందని.. పొత్తులో ఒకట్రెండు అంశాల్లో సర్దుకుపోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు అమాయకత్వం ఒలకపోసి, తాను అనుకున్న వారికి టికెట్లు ఎగ్గొడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ లిస్టులో చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ మరో నలుగురు ఉన్నారు.

వారికి సీట్లిస్తే జనసేన నుంచి ఓట్ల బదలాయింపు జరనగదని పవన్ తో చంద్రబాబు చెప్పించారు. పొత్తులో భాగంగా చంద్రబాబు కూడా దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. మా పార్టీ అంతర్గత వ్యవహారాలు మీకెందుకుని.. వైసీపీలో కూడా సీనియర్లకు చెక్ పెట్టడం.. కొంతమందికి స్థానచలనం కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక పార్టీ బలహీనతల్ని మరో పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: