పొత్తులెక్కలు: అంత తక్కువ సీట్లకు పవన్‌ ఒప్పుకుంటారా?

తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య సీట్ల విషయమై ఎడతెగని చర్చ జరగుతోంది. ఇటీవల జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ 32 సీట్లు అడిగారని వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన అభిమాన వర్గాల ఆశలు తలకిందులు అయ్యాయి. ముందుగా పవన్ మూడో వంతు సీట్లు డిమాండ్ చేశారు.

60పైగా సీట్లు డిమాండ్ చేసి సగానికి సగం పడిపోవడం ఏంటని ఆ పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ సానుభూతి పరుడు, కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య లాంటి లేఖ కలకలం సృష్టిస్తోంది. పవర్ షేరింగ్ అవసరం అంటూ చేసిన హెచ్చరిక కాపుల్లో ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాముందే టీడీపీ మీడియా చేస్తున్న అతి ప్రచారంపై కాపులు మండిపడుతున్నారు.

కాపులకు ఒక్కసారైనా రాజ్యాధికారం దక్కాలని ఆ సామాజిక వర్గ నేతలు ఎదురు చూస్తున్నారు. అది పవన్ ద్వారా సాధ్యం అవుతుందని బలంగా నమ్ముతోంది ఆ వర్గం. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లు లో జనసేన పోటీ చేయాలని సగటు కాపు సామాజిక వర్గ నేతలు భావిస్తున్నారు. కానీ పవన్ సీట్ బేరం 32తో ప్రారంభమైందని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. పొత్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయోద్దని ఇప్పటికే పవన్  ఆపార్టీ నేతలకు సూచించడంతో చాలా మంది మీడియా ఎక్కడం లేదు.

వాస్తవానికి జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, ఎనిమిది ఎంపీ స్థానాలు ఇస్తారని అంతా భావించారు. ఎక్కువ స్థానాల్లో జనసేన గెలిస్తే టీడీపీ జనసేనపై ఆధారపడుతోంది. కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీ సింగిల్ పార్టీగా మెజార్టీ సాధిస్తే కాపులకు రాజ్యాధికారం దక్కదు. ఇది కాపుల్లో అసంతృప్తికి కారణం అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ జనసేనపై ఆధారపడాలని .. అందుకే వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో పోటీచేసి గెలుపొందాలని కాపు నేతలు భావిస్తున్నారు. అలా అయితేనే కాపులకు రాజ్యాధికారం వస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: