పాపం.. జగన్‌.. ఎన్ని ఆర్థిక కష్టాలో?

పరిపాలన అంటే అంత ఈజీ కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్నో ఉంటాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మరి ఇందులోనే అన్నీ సర్దుకు రావాలి. అదే పాపం.. ఏపీ సీఎం జగన్ కష్టం కూడా. ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు వచ్చాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి.  కోవిడ్‌ కష్టాల కారణంగా కష్టాలు పెరిగాయి. ఈ ఐదేళ్లలో విచిత్రమైన పరిస్థితులు.. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనుకోని ఖర్చులు వచ్చి చేరాయి.

అంతే కాదు.. ఏపీ రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వసూలు చేసిన ట్యాక్స్‌ల్లో మన రాష్ట్ర వాటాలు  బాగా తగ్గాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా బాగా తగ్గాయి. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. రెవెన్యూ రేటు ఇబ్బందులు కూడా ఏపీకి ఉన్నాయి. కోవిడ్‌కు వల్ల రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా రూ.66 వేల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. 2015–2019లో ఏపీ రాష్ట్రంలో స్టేట్‌ ట్యాక్స్‌ రెవెన్యూ13.29 శాతం పెరిగితే.. అందులో రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1,15,552 కోట్లు మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా తగ్గింది. 2015–2019 మధ్యలోకేంద్ర ఆర్థిక సంఘం సిఫార్స్‌ రాష్ట్రాలకు 42 శాతం కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 35 శాతం మాత్రమే ఇచ్చింది. కేంద్రం ఇటీవల సెస్‌లు, సర్‌చార్జ్‌ల పేరుతో వాటాను తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 31 శాతం మాత్రమే ఏపీకి ఇచ్చారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రావాల్సి పన్నుల వాటా 28 వేల కోట్లుకు తగ్గింది. 2022– 2023లో అది ఇంకాస్త తగ్గి రూ.24 వేల కోట్లుకు పడిపోయింది.

ఈ లెక్కలన్నీ పాపం.. జగన్‌ స్వయంగా అసెంబ్లీలో చెప్పినవే.. ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. పథకాలు బ్రహ్మాండంగా అమలు చేశామని జగన్ చెబుతున్నారు. అందుకే మళ్లీ గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. మరి జనం ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: