ఆ కులాలనే జగన్‌ నమ్మారా.. తేలతారా..మునుగుతారా?

ఏపీలో ఎవరు గెలవబోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రానుంది. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా.. లేక టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా.. ఇప్పుడు ఏపీ అంతటా ఇదే చర్చ.  ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఆయా పార్టీలు జోరు పెంచుతున్నాయి.

కాకపోతే  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం వైఎస్ జగన్ చేసిన సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు విడతల వారీగా వైసీపీ 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డు స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పదహారు స్థానాల్లో ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానాన్నికేటాయించారు. ఇవి వాళ్లకు రిజర్వ్ అయిన స్థానాలు. ఇక ఓసీలకు ఇచ్చిన సీట్లు నాలుగు. ఈ మూడు  వర్గాలకు కలిపి ఏడు సీట్లు ప్రకటించారు.

ఇక బీసీల విషయానికొస్తే పదహారు సీట్లలో తొమ్మిదింటిని వీళ్లకే కేటాయించారు. ఇంకా ప్రకటించాల్సిన సీట్లు తొమ్మిది ఉన్నాయి. ఇందులో కూడా బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఎక్కువ శాతం బీసీలకు సీట్లు కేటాయించే ధైర్యం ఎవరూ చేస్తారు అని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలకు ప్రకటించిన సీట్లను మనం గమనించాం. కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లను కేటాయిస్తామని చెప్పి చివరకు చేతులెత్తేసింది.

కానీ జగన్ మాత్రం తన సామాజిక వర్గాన్ని కాదని.. బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. సాధారణంగా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు అంటే బాగా డబ్బుండాలి అన్ని పార్టీ నేతలు భావిస్తుంటారు.  కానీ జగన్ మాత్రం ఇవేమీ ఆలోచించడం లేదు. ఉదా రఘురామ కృష్ణ రాజుతో పోలిస్తే సత్యబాల దగ్గర ఆస్తి చాలా తక్కువ. రూ. వందల కోట్లు ఖర్చు పెట్టగలిగే ఓసీ అభ్యర్థులు ఉన్నా కూడా జగన్ బీసీలనే నమ్ముకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: