నిజమా.. ఆంధ్రాకు మోడీ.. చాలా ఇస్తున్నారా?

చంద్రబాబు నాయుడి కోసం ఎల్లో మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు బద్నాం అవుతారు అనుకుంటే ఎలాంటి కరడు గట్టిన నిజాన్ని అయినా సరే దాచి పెట్టేందుకు రెడీ అవుతారు. అదే సమయంలో చంద్రబాబుకి ప్లస్ అవుతుంది అనుకుంటే మాత్ర ప్రతిపక్షం, మిత్ర పక్షం అని చూడకుండా బురదజల్లేందుకు రెఢీ అయిపోతుంది ఎల్లో మీడియా.

ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు. ఈ రోజు బడ్జెట్ చూసుకుంటే కేంద్రం వాటానే రూ.45వేల కోట్లు వస్తోంది. ఇది ఆదాయం కాదు. మనం కట్టే పన్నుల్లో కేంద్రం తిరిగి మనకి ఇచ్చేది. ఆంధ్రాలో అప్పులు ఇవ్వడానికి  వచ్చిన విదేశీ సంస్థలన్నీ కూడా పారిపోతున్నాయన ప్రచారం చేశారు.  ఈ రోజు బడ్జెట్ సందర్భంగా కేంద్రమంత్రి సీతారామన్ ఇచ్చిన లెక్కలు చూసుకుంటే మనకి కొన్ని వాస్తవాలు అర్థం అవుతాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఈ మధ్యంతర బడ్జెట్ లో రూ.2121.87  కోట్లను కేటాయించింది. మొత్తం అయిదు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐఐబీ, జపాన్ ప్రభుత్వం, ఎన్డీబీ, ఐబీఆర్డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకుంటోంది. వాటన్నింటిని కలిపి ఈ సంస్థలు ఇప్పటి వరకు రూ.2646.77 కోట్లు విడుదల చేశాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కేంద్రం మరో రూ.2121 కోట్ల కేటాయింపులు చేసింది.

ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టు కు ఏఐఐబీ రుణం కింద రూ.221.87 కోట్లు మంజూరు చేసింది. ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు రెండో దశకు జపాన్ ప్రభుత్వం రుణం కింద రూ.300 కోట్ల రుణం కేటాయింపు. ఏపీ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేష ఆపరేషన్ ఐబీఆర్డీ రుణం కింద రూ.300 కోట్లు మంజూరు. ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ర్టక్షన్ ప్రాజెక్టు ఏన్డీబీ రుణం కింద రూ.650 కోట్లు కేటాయింపు.  ఏపీ మండల్ కనెక్టివిటీ రూరల్, కనెక్టవిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టుకు ఏన్డీబీ రుణం కింద రూ.650 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: