జార్ఖండ్‌ రాజకీయాల్లో మోదీ వేలు పెడుతున్నారా?

జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వారం రోజుల్లోనే చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవి నుంచి హేమంత్ సోరెన్ తప్పుకోవడం.. ఆ తర్వాత మంత్రి చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చాలా వేగంగా జరిగిపోయాయి. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ యత్నిస్తోందని సోరెన్ క్యాంప్ గట్టిగానే వాదిస్తోంది.

అయితే అక్రమాస్తుల కేసులో ఈడీ ఆ రాష్ట్ర సీఎంను అరెస్టు చేసిన నేపథ్యంలో తదపరి ముఖ్యమంత్రి ఎవరా అనే చర్చ జోరుగా సాగింది. ముందుగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సీఎం బాధ్యతలు స్వీకరిస్తారు అని భావించినా చివరి నిమిషంలో చంపయూ సోరెన్ ను తదపరి సీఎల్పీ నేతగా ఎన్నుకుంటూ ఆ పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జార్ఖండ్ కొత్త సీఎంగా గురువారం రాత్రి ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే దీనికంటే ముందు 81మంది శాసన సభ మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో తమకు 48మంది మద్దతు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభా పక్షనేతగా ఎన్నికైన చంపయీ సోరెన్ గవర్నర్ రాధాకృష్ణన్ గురువారం రాత్రి పొద్దుపోయాక గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ఆయన్ను నియమిస్తూ.. ప్రమాణ స్వీకరించడానికి ఆహ్వానించారు. ఆయన నిర్ణయం ఒక పట్టాన రాకపోవడంతో రాజకీయ పక్షాలు తొలుత కలవరపడ్డాయి.

చంపయీ మరోసారి గవర్నర్ ను కలిసి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలంటే కొత్త సర్కారుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్ననేతను ప్రభుత్వ ఏర్పాటు పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ప్రజాతీర్పును కాలరాసినట్లు అవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అయితే టెక్నికల్ సమస్య కారణంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటును కొంత ఆలస్యం చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.  సీఎంగా హేమంత్ సోరెన్ ఉండగానే శాసన సభ పక్షనేతగా చంపయీ సోరెన్ ను ఎన్నుకున్నారు. ఈ టెక్నికల్ పాయింట్ కారణంగా గవర్నర్ కొంత అభ్యంతరం తెలిపారని దీనికి ప్రధానికి ఏం సంబంధం అని వారు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: