తెలంగాణ విద్యుత్‌.. రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం?

విద్యుత్‌ రంగానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన శాఖ పరిధిలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంల బోర్డులలో 11 మంది నూతన డైరెక్టర్ల నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంల డైరెక్టర్ల నియామకాలు నిబంధనల మేరకు జరగ లేదని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. అందుకే డైరెక్టర్ల నూతన నియామకానికి రేవంత్‌ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేయించారు.

గతంలో ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏడుగురు డైరెక్టర్ల నియామకాలు నిబంధనల మేరకు జరగలేదని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీరిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిస్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తొలగించిన డైరెక్టర్లలో ఆపరేషన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న జే శ్రీనివాసరెడ్డి 9 సంవత్సరాల రెండు నెలల వరకు పని చేశారు. ఇక ప్రాజెక్టు డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న టీ శ్రీనివాస్ 10 సంవత్సరాల 5నెలలపాటు పనిచేశారు. కమర్షియల్ డైరెక్టర్ గా కే రాములు ఐదేళ్ల నాలుగు నెలలు విధులు నిర్వర్తించారు.

వీరు కాకుండా హెచ్ ఆర్ డైరెక్టర్ గా పర్వతం ఐదేళ్ల నాలుగు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పీఅండ్ఎంఎం డైరెక్టర్ గా మదన్ మోహన్ రావు ఐదేళ్ల నాలుగు నెలలుగా విధుల్లో ఉన్నారు. ఐపీసీ అండ్ ఆర్ఏసీ డైరెక్టర్ గా స్వామిరెడ్డి ఐదేళ్ల నాలుగు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆడిట్ డైరెక్టర్ గా గంప గోపాల్ రెండేళ్ల ఐదు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో నలుగురు డైరెక్టర్ల నియామకాలు నిబంధనల మేరకు జరగలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీరిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ నిర్ణయాలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: