కేటీఆర్ దూకుడు.. మొదటికే ముప్పు తెస్తుందా?

ప్రజాస్వామ్యంలో గెలిపించన ప్రజలను విస్మరించి.. నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్న ధోరణి.. ప్రజలకు మేం తప్ప మరే అవకాశం లేదు అన్న అహంకార ధోరణి బీఆర్ఎస్ ను గద్దె దించిందన్న వాదనలు లేకపోలేదు. ఈ విషయం  ఆపార్టీ నేతలందరికీ అర్థమైంది. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెంట్ కేటీఆర్ కు అర్థం అయినట్లు లేదు.

మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.  ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆయన తాజాగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. పెద్దలు ఎప్పుడో చెప్పారని..  సుమతీ శతకంలో భాగంగా బద్దెన రాసిన  కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టిన శుభ లగ్నమున దొరరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను? వినురా సుమతీ అనే పద్యాన్ని దాన్ని తాత్పర్యాన్ని పోస్టు చేశారు.

అయితే ఇది రేవంత్ రెడ్డిని ఉద్దేశించే అని పలువురు పేర్కొంటున్నారు. దీనికి ఎక్కువశాతం మంది ఈ పద్యం మీకే సరిపోతుంది అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఆ శునకాలను తరిమే తీర్పు ఇచ్చారు ప్రజలు అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా కేటీఆర్ అధికారం కోల్పోయి 50 రోజులు కూడా కావడం లేదని.. ఇంతలోనే ఎందుకు ఇంత అసహనం అని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించింది.  ఇప్పటికే రెండు గ్యాంరెంటీలను అమలు చేయగా మిగతా వాటిని అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.  కానీ 100 రోజులు  పూర్తి  కాకముందే బీఆర్ఎస్ హామీలు అమలు చేయలేదు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.  దావోస్ పర్యటనలో అతని భాషపై విమర్శలు చేశారు. భాష లేకున్నా కేటీఆర్ కు మించే పెట్టుబడులు రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు కదా. అలాగే శునకపు పద్యం పెట్టాల్సిన అవసరం ఏముంది. అంత తప్పు ఆయన ఏం చేశారన్న వాదన వినిపిస్తోంది.  ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు అని కేటీఆర్ తన వైఖరి మార్చుకోకుంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: