అయోధ్య అంశంతో మోదీకి లాభం ఎంత?

అయెధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ పై కేబినేట్ ప్రశంసల వర్షం కురపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు ప్రధాని పై కనబరిచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది.

ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది అని అని పేర్కొంది. భరత జాతి శతాబ్ధాల కలను సాకారం చేసినందుకు ప్రధాని కి కృతజ్ఙతలు అంటూ తీర్మానం చేసింది. దీనిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చదివి వినిపించారు. 1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్ర్యం వచ్చింది.  దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.

ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టిలయ్యారు. రామ మందిర ప్రతిష్ఠాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు అంటూ మోదీపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా కేబినేట్ భేటీలో ఆసాంతం భావొద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. అయితే నిజంగా రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్బంగా ప్రధాని మోదీ ఇమేజ్ పెరిగిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ప్రధాని మోదీని హిందుత్వ ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేశారని.. అందులో బీజేపీ విజయవంతం అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని మోదీ వాక్ చాతుర్యంతో దీనికి కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. అయోధ్యకు మన రాముడు వచ్చాడు. మన రాముడిని ప్రధాని మోదీ తీసుకువచ్చారు. ఇది భారత దేశంలో హిందువుల అభిప్రాయం. 500 ఏళ్ల నాటి నిరీక్షణ, ఏ ప్రధానికి సాధ్యం కానీ రామ జన్మ భూమి వివాదానికి సామరస్య పరిష్కారం చూపడంలో మోదీ సఫలీకృతుడయ్యారు. ఇది కచ్చితంగా ప్రధాని ఇమేజ్ ని పెంచుతుందని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: