రాముడంటే భారత్‌లోనే.. ప్రపంచమంతా?

కొన్ని క్షణాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. భారత ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణ ప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలిసిన మందిర ప్రారంభం, అక్కడ అయిదేళ్ల బాలరాముడి విగ్రహానికి సోమవారం జరిపిన ప్రాణ ప్రతిష్ఠాపన ఘట్టం అలాంటిదే. మరో వెయ్యేళ్లు గుర్తుండిపోయే రోజుగా మోదీ పేర్కొన మందిర ప్రారంభ రోజున కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రామనామం ప్రతిధ్వనించింది. నేపాల్, బాలీ, ట్రినిడాడ్ సహా దేశ దేశాల్లో హిందువులు ఉత్సవం చేసుకున్నారు.

వజ్ర వైఢూర్య కచ్చిత స్వర్ణ భరణాలంకృత మందస్మిత బాలరామ రూపా సాక్షాత్కారం సాయం సంధ్యలో సరియు తీరంలో లక్షల సంఖ్యలో దీప ప్రజ్వలనంతో అనంత కాలగతిలో ఒక చక్రభ్రమణంలో పూర్తి అయింది. నాగరికతలో ఇదొక మహోత్తర క్షణమని రామరాజ్య స్థాపనకు తొలి అడుగని కొందరంటే రామరాజ్యం అంటే హిందూరాజ్యం కాదు ధర్మ రాజ్యం అనే గాంధీ భావనకు ఇతరులు గుర్తు చేయల్సి వచ్చింది.

అనేక మత ఘర్షణలు, దశాబ్ధాల రాజకీయ న్యాయ పోరాటాలు ఈ మందిరం నిర్మాణం వెనుక ఉన్నాయి.  రామ జన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాకీ కట్టినట్లు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబరు 6న కర సేవకులు చేతిలో కూలడం చివరకు సుప్రీం కోర్టు వేర్వేరుగా ఆలయ మసీదు నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వడం అలా అది ఒక సుదీర్ఘ చరిత్ర. వెరసి అయిదు శతాబ్ధాల తర్వాత రామ్ లల్లా అది మందిరమైంది.

బాల రాముడి ఇక టెంటులో ఉండాల్సిన పనిలేదు. రామ్ లల్లా మందిరంలో కొలువై ఉంటాడు అని ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు. జై శ్రీరామ్ నినాదాలతో నిన్న యావత్ దేశం హోరెత్తిపోయింది. త్రేతాయుగం నాటి శ్రీరాముడి మర్యాద పురుషోత్తముడిగా భరతజాతికెంత పూజనీయుడో ఇంటి ముందు వేసిన ముగ్గుల్లో వాడవాడలా సాగిన వేడుకల్లో కళ్లకు కట్టింది. అయోధ్యంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఇంటింటి పండుగగా రూపాంతరం చెందిందంటే తారతమ్య భేదాలు లేకుండా రఘురాముడితో తరాలు తరబడి ముడి వేసుకున్న భావోద్వేగ బంధమే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: