మళ్లీ ఓటమి దిశగా కేసీఆర్‌ టీమ్‌.. ఇదే కారణం?

అసెంబ్లీ  ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని పరాజయం ఎదుర్కొంది.  దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఫోకసంతా లోక్ సభ ఎన్నికలపై పెట్టింది.  పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి కూల ఫలితాలు వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావించిన అధిష్ఠానం పార్టీ బలోపేతం దిశగా దృష్టి సారించింది.  ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతున్నారు.  

తెలంగాణ భవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.  ఇందులో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.  గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకో ఏడెనెదిమిది స్థానాల్లో గెలిస్తే రాష్ట్రంలో హంగ్ ఏర్పడి ఉండేది అని పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్లను మాత్రమే అధికంగా సాధించిందని వివరించారు.

తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామని చెబుతూ కాంగ్రెస్ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల సమయంలో మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్ ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఓటమిపాలైంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైనా పట్టణ ఓటర్లు గులాబీ పార్టీని ఆదరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఈ సారి సానుకూల ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

మరో ఏడెనిదిమిది స్థానాల్లో గెలిస్తే హంగ్ వచ్చేదే అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  రెండు శాతంతో ఓడిపోయినా అధికారానికి ఐదేళ్లు ఉండాల్సిందే అని గుర్తు చేస్తున్నారు. ప్రగతి భవన్ లో మాజీ  సీఎం కేసీఆర్ వారంలో ఒకరోజు ప్రజలను కలిసినా.. పార్టీ నాయకుల  ప్రవర్తన మార్చుకుంటే గెలిచే వాళ్లం కదా అని ఇప్పుడు అనుకున్నా పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని  పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: