కవిత అరెస్ట్‌, కేసీఆర్‌ స్కెచ్‌.. మళ్లీ హాట్‌ హాట్‌?

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సీఎం కేసీఆర్ దగ్గరుండి నడిపించారని అప్పట్లో బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే కవిత లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన కుట్రలో భాగంగా బీజేపీ అగ్ర నాయకుడు సంతోష్ కుమార్ ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇందులో భాగంగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ ఫాం హౌస్ లో ఇద్దరు స్వామిజీలు, ఒక వ్యాపారవేత్తను కలవగా.. ఉన్నట్టుండి అక్కడ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రాలేదని కేవలం ఒక ఎమ్మెల్యేకు స్వామిజీ పరిచయం వల్ల వచ్చారని దీనిపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

రాష్ట్ర హైకోర్టు కూడా ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టి పారేసింది. అయితే సీఎం కూతురు కవిత లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు చేసిన అతి పెద్ద ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ మధ్య జైలు నుంచి బయటకు వచ్చిన నందకుమార్ కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. అసలు అక్కడ ఎలాంటి ఎమ్మెల్యేల కొనుగోలు జరగలేదు. కేవలం తెలిసిన వారు పిలిస్తే మాత్రమే వెళ్లాం. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీబీఐ విచారణలోనే నిజానిజాలు బహిర్గతమవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరి కొన్ని సంచలన విషయాలు బయట పెడతానని ఆయన చెప్పారు. అసలు లిక్కర్ కేసుకు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మధ్య ఏం జరిగింది. ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఉప్పు నిప్పులా మారాయి. తర్వాత కవితను సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎందుకు మరుగున పడిపోయింది మళ్లీ పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో వీటిపై ఫోకస్ పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: