అలా చేయడానికి.. జగన్‌కు ఎంత గుండె ధైర్యం?

ఆంధ్రలో సీఎం జగన్ తెగింపు ఎవరికీ ఉంటుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ టికెట్లు ఇచ్చేందుకు పొత్తు తేల్చుకునేందుకు టైం సరిపోవడం లేదు. ఎవరికీ టికెట్ ఇస్తే ఎవరు ఎదురు తిరుగుతారో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. కానీ జగన్ ఇప్పటికే చాలా చోట్ల ఇన్చార్జిలను మార్చేశారు. ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇస్తానని ఇప్పటికే చెప్పారు.

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారు. ఇలా చెప్పినప్పటికీ అంతగా వ్యతిరేకత రాలేదు. కానీ కాస్తో కూస్తో కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. కానీ దాన్ని పట్టుకుని కూర్చుంటే రేపు అధికారంలోకి రాకుండా అదే అడ్డుకుంటుంది. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఏ నాయకుడి మీద ఎక్కువగా ఉంది. ఎవరికి టికెట్లు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదనేది నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది మంత్రులకు కూడా స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.

డజన్‌ కి పైగా ఎమ్మెల్యేలకు ఇప్పటికే టికెట్లు ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌ లకే టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. అలా కాకుండా కచ్చితంగా సిట్టింగ్‌ ల మీద వ్యతిరేకత ఉంటే వెంటనే మార్చి వేస్తున్నారు.  దీంతో ఇది ఫలిస్తుందని నమ్ముతున్నారు. కానీ దాని ఫలితం ఎలా ఉండబోతుందనేది ఎవరికి తెలియడం లేదు. టీడీపీ, జనసేన కలిసి పొత్తు  ఇంకా తేలడం లేదు. ఆ లోపు ఎక్కడ మార్పులు చేసుకుని ఎలా ముందుకు సాగాలో జగన్ ముందే నిర్ణయం తీసుకుంటున్నాడు.

మరి ఇలా చేయడం వైసీపీకి కలిసొస్తుందా.. లేక బెడిసికొడుతుందా అనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోనుంది. అయినా 151 స్థానాల్లో అఖండ విజయం తర్వాత అంత మంది ఎమ్మెల్యేల్లో కొందరికి అసంతృప్తి రావడం కామన్.. కానీ దాన్ని అధిగమించి రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలో తేల్చుకోవాలని సీఎం జగన్ ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: