ఔరా అనిపించేలా.. బాబు రాజకీయ వ్యూహం?
అయితే ఇప్పుడు ఆయన గురించి మరో ఆసక్తికర అంశం మనం తెలుసుకుందాం. అదేంటంటే 2018లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సందర్భంలోను కమ్యూనిస్టులు ఆయన వెంటే ఉన్నారు. అద్భుత పాలన అని కొనియాడారు. తీరా ఎన్నికలకు వెళ్తే కనీవినీ ఎరుగని ఫలితాలు వచ్చాయి. అదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు ను విభేదించి ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. ఎన్నికల సమయానికి వచ్చే సరికి అసలు అధికారమే చేపట్టని జగన్ ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారు. చంద్రబాబుని మాత్రం పల్లెత్తి మాట అనలేదు.
మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా టీడీపీతో కలిసే పనిచేశారు. అసలు టీడీపీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. అలాంటి బద్ధ శత్రువులైన హస్తం పార్టీతో చేతులు కలిపి తన వైపునకు తిప్పుకోగలిగారు. 2014కి ముందు బీజేపీ చంద్రబాబుతో ఎప్పటికీ కలవం అని చెప్పారు. కానీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. కాబట్టి చంద్రబాబు ఏం అనుకుంటే అదే జరుగుతుంది.
ఎవరితో కలవాలి. ఎవరితో ఎన్నికలకు వెళ్లాలి ఇలా అన్నీ చంద్రబాబు అనుకున్న విధంగానే జరగుతుంటాయి. వీళ్లందర్నీ చంద్రబాబు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది ఇప్పటికే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. గతంలో వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీకి దగ్గర అయ్యారు అనేవారు. మరి ఇప్పుడు వెంకయ్యనాయుడు లేరుగా అంటే అందుకే పురంధేశ్వరిని తన వైపు తిప్పుకోగలిగారు. చంద్రబాబు ప్రత్యేకత ఏంటంటే.. టీడీపీ నుంచి వీడిన నాయకులు ఆయన్ను పల్లెత్తి మాట కూడా అనరు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఆయన్ను పార్టీని వీడిన సమయంలోను ఆ తర్వాత గానీ ఒక్క మాట అనరు. చంద్రబాబు ఏం మంత్రం పెట్టారో మరీ. ఆయన ప్రేమగా చూసుకుంటారు కాబట్టే ఇదంతా అని చంద్రబాబు అభిమానులు అంటుంటారు.