జేడీ కొత్త పార్టీ జనసేనకు గండి కొడుతుందా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జై భారత్ అనే పార్టీని పెట్టారు. దీని కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జేడీ లక్ష్మినారాయణకు చాలా మంది పేరు ఉంది. సీబీఐ లో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతి సవాళ్లు, ధీటైన పోరాటం ఇలా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంతో మంది యువతకు ఆకట్టుకునేలా ఉండడంతో ప్రజలు చాలా ఆకర్షితులయ్యారు.


అయితే 2019 సంవత్సరంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరిన జేడీ విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత టీడీపీ, వైసీపీ నుంచి ఎన్నో ఆపర్లు వచ్చినా కూడా ఆయన ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. జనసేన నుంచి వెళ్లి పోయిన సమయంలో ఆయనపై జనసేన అభిమానులు విమర్శలు కూడా చేశారు.


జనసేన, టీడీపీ ఇప్పుడు కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నాయి. వైసీపీని ఓడించేందుకు రెండు ఒక్కటి కావాలని భావిస్తున్నాయి. మరి ఇలా చేస్తున్నందుకు ఎందుకు వీరు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారని జనసేనలో ఉన్న కార్యకర్తలు అధినేతను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. అదే సమయంలో ఎందుకు టీడీపీ జనసేనతో కలవాలని కోరుకుంటుందని టీడీపీ కార్యకర్తలు అడగడం లేదు. అయిదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పాలిస్తుంది.


మాకు అధికారం ఇవ్వండని మాత్రం జనసేన ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఇప్పటికీ జనసేన కార్యకర్తలు మరో పార్టీపై నే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. పోనీ బీజేపీ తమకు అవకాశం ఇవ్వమని ప్రజల్లోకి వెళ్లి అడగడం లేదు. మళ్లీ గెలిస్తే వైసీపీ, గెలిస్తే టీడీపీ అనే విధంగానే సాగుతోంది. ఇలా జరగడం వల్ల ఎవరూ నష్టపోతారు. ఎవరూ లాభం పొందుతారు. అందుకే చివరకు జేడీ లక్ష్మినారాయణ జై భారత్ అనే పార్టీ పెట్టి ముందుకు రావాలని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

JD

సంబంధిత వార్తలు: