సహజీవనం.. సంస్కృతిని నాశనం చేస్తుందా?
హరియాణాకు చెందిన బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ సంచలనాలకు వేదికగా మారారు. ఆయన ఏం మాట్లాడినా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన ఏకంగా లోక్ సభలోనే వివాదాల తేనెతుట్టెను కదిలించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో జీర్ అవర్ లో అనూహ్యంగా సహజీవన అంశాన్ని లేవనెత్తారు. దీనిని ప్రమాదకర అంటు వ్యాధిగా అభివర్ణించారు.
ఆయన ఇంకా ఏం అన్నారంటే.. సహజీవనం అంటు వ్యాధిలా వ్యాపిస్తోంది. ఒకరిని చూసి మరొకరు సహజీవనం చేస్తున్నారు. దీనివల్ల కాపురాలు కూలిపోతున్నాయి. భారతీయ సంస్కృతికి ప్రమాదం ఏర్పడింది. వసుధైన కుటుంబమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మానం భిన్నమైంది. కానీ ఇప్పుడు ఇవన్నీ.. సహజీవనం అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాయి అన్నారు. అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు సైతం విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు.
వివాహం విషయంలో తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని కోరారు. అలాంటి వివాహాలే కలకాలం నిలుస్తున్నాయని వివరించారు. పాశ్చాత్య దేశాల్లో సహజీవనం సాధారణం అయినప్పటికీ మన దేశంలో ఇది సరికాదన్నారు. వీటి పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటున్నాయన్నారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్-అఫ్తబ్ పూనావాల కేసును ఉదహరించారు. ఈ నేపథ్యంలో సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని తద్వారా ఈ ప్రమాదకరమైన అంటే వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించవచ్చని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. చూద్దాం కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో.