తెలంగాణపై తెలుగుదేశం ప్లాన్ ఇదే?
2018 ఎన్నికల్లో ఆయన సర్వే అంచనాలు నిజం కాకపోయినా.. 2019 ఎన్నికల్లో అయినా జరుగుతాయని కొందరు భావించారు. అంతటి విశ్వాసాన్ని పొందారు. కానీ టీడీపీకి అనుకూలంగా మారి సర్వే ఫలితాలు ఒకటి వస్తే వాటిని మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఫలితం ఆయన ఇప్పుడు సర్వేలకు దూరం కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.
ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ ఢీ అంటే ఢీ గా ఉంది. ఈ మధ్యలో వచ్చే సర్వే ఫలితాలు ఒక సంస్థ కాంగ్రెస్ అంటే మరోకటి బీఆర్ఎస్ అంటూ ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీంతో ఏది నమ్మాలో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ సర్వే ఫలితాలు తటస్థ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎవరికి అనుకూలంగా వారు సర్వే ఫలితాలు చెప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ విషయానికొస్తే ఈ సారి ఎన్నికల్లో ఆపార్టీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతుంది. టీడీపీ అంచనా ఏంటంటే పీకే తన టీంతో ప్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని బీఆర్ఎస్ కు 40కి మించి స్థానాలు రావని ప్రచారం నిర్వహిస్తున్నారు. పీకే ఎవరి తరఫున పనిచేస్తున్నారో తెలియదు కానీ టీడీపీ మాత్రం ప్రశాంత్ కిశోర్ పేరును వాడుకొని ఈ తరహా ప్రచారానికి తెరతీసింది.