చంద్రబాబుకు బెయిల్‌ ఇప్పించిన కంటి సమస్య?

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్య సమస్యల కారణంగా బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్ చికిత్స అవసరం అయిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్యులు నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ బి శ్రీనివాసరావు ఈనెల 25న చంద్రబాబునాయుడు కంటిని పరీక్షించి జైలు అధికారులకు నివేదికను ఇచ్చారు.


ఆ నివేదికలో చంద్రబాబు కుడికంటిలో  ఇమ్మెచ్యూర్డ్ క్యాటరాక్ట్ ఉందని అన్నారు. దానికి శస్త్ర చికిత్స చేయాలని హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. ఈ వైద్యులే  2016లో చంద్రబాబునాయుడికి యాంగిల్ క్లోజర్ గ్లుకోమా అనే కంటి సమస్యకు లేజర్ చికిత్స చేయడం జరిగింది. అలాగే వారే చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు కూడా చేశారు.


ఆ తర్వాత కుడి, ఎడమ కంటి  చూపుల్లో వ్యత్యాసం ఉన్నందున తిరిగి 3నెలల్లో మళ్లీ కుడి కంటికి చికిత్స చేయవలసిన అవసరం ఉందని వాళ్ళు అప్పుడే చెప్పడం జరిగింది.  తాజాగా ఇటీవల వాళ్ళు ఇచ్చిన నివేదికలో మళ్లీ దీనినే వాళ్లు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కంటి చికిత్స జరగడం అనేది అవసరమే. దానిని ఎవరూ అడ్డుకునేది లేదు. ఇప్పుడు బెయిల్‌ ఇచ్చేందుకు కూడా ఇదో ప్రధాన కారణంగా మారింది.


ఈ కంటి చికిత్స నిమిత్తం ఆయనకు బెయిల్ ఇచ్చారు. మామూలుగా అయితే బెయిల్ ఇవ్వకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య సదుపాయాలు కల్పించే అవకాశం ఉన్నా.. జడ్జి మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అలా ఇవ్వకపోతే మాకు prasad OLD' target='_blank' title='ఎల్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ లోనే చికిత్స జరగాలి అని వాళ్ళు పిటిషన్ వేయడానికి కూడా అవకాశం కూడా ఉండేది. ఏదేమైనా చంద్రబాబుకు బెయిల్‌ రావడంలో కంటి సమస్య కూడా ఉపయోగపడిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: