తెలంగాణ తెలుగుదేశం.. అంతా అయోమయం?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది కాంగ్రెస్ రెండో లిస్టును రిలీజ్ చేసి 100కు పైగా అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ మొదటి లిస్టు ప్రకటించి రెండు మూడు రోజుల్లో తదుపరి అభ్యర్థుల లిస్టు ఇవ్వనుంది.

ఇలాంటి సమయంలో తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కాసాని మొదటి నుంచి పోటీలో ఉంటామని చెబుతున్నారు. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జైల్లో ఉండటంతో పోటీపై సందిగ్ధం నెలకొంది. మొన్నటి వరకు 80 స్థానాలకు పైగా పోటీ చేస్తామని ప్రకటించిన కాసాని, చంద్రబాబు తెలంగాణలో పోటీకి సుముఖత చూపకపోవడంతో బీఆర్ఎస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముందు చూస్తే నుయ్యి వెనక చూస్త గొయ్యి అనే విధంగా తయారైంది టీడీపీ పరిస్థితి.

తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోటీ చేయాలని కాసాని భావిస్తుంటే వద్దని చంద్రబాబు వారిస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఓడిపోతుంది అంటే టీడీపీ గట్టి పోటీ ఇవ్వొచ్చు. ఒకవేళ టీడీపీ పోటీలో నిలబడి బీఆర్ఎస్ ఓట్లు చీల్చే పని చేస్తే ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో కేసీఆర్ టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తారని ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపడతారని కొంత భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది.

మరో ప్రచారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడికి సంబంధించిన రూ. 300 కోట్లకు సంబంధించిన ప్రాఫర్టీ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దాన్ని పరిష్కరిస్తామనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కాస్త బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రం మరింత అయోమయానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: