అయ్యో దేవుడా.. జగన్ మాట తప్పినట్టేనా?
పుష్కరాల సమయంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం కొన్ని గుడులను కూల్చివేశారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన వాటిని నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు అటు వైపు అడుగులు పడలేదు. మొదట్లో దేవాదాయ శాఖ మంత్రిగా వల్లంపల్లి ఉన్న సమయంలో ఈ గుడులను అన్నింటినీ పుష్కర ఘాట్ సమీపంలో నిర్మిస్తామని చెప్పారు. తదనంతర కాలంలో కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తదనంతరం వాటి నిర్మాణంపై మరిచిపోయారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రాజకీయ నాయకులు ఈజీగా మరిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గెలవడానికి ఎలాంటి హామీలనైనా ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడానికి మాత్రం నానా తంటాలు పడతారు. అవకాశం ఉన్నా కూడా చూసీ చూడనట్లు పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ప్రతి సందర్భంలో రాజకీయ నాయకులపై వ్యతిరేక భావం ఏర్పడుతుంది.
కొన్ని సార్లు అసంభవమైన వాగ్దానాలు ఇవ్వడం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత వారు పడే కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లాలంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కానీ హామీలు నెరవేర్చకుండా ప్రజల్లోకి వెళతామంటే అక్కడ విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారి విమర్శలు ఎదుర్కొనే బదులు ఇచ్చిన హామీలను ఎలాగోలా నెరవేర్చితే బాగుంటుందనే భావన కలుగుతుంది.