బెయిల్‌ కోసం బాబు.. సుప్రీంకోర్టుకు వెళ్లక తప్పదా?

చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్టులో బెయిల్ రావచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేశారు. సెక్షన్ 17 ఏ దేనికి అంటే ప్రభుత్వ అధికారులు గానీ ప్రతినిధులను గానీ అరెస్టు చేసినపుడు వారిని తొలగించే అధికారం ఎవరికి ఉంటే వారికి ఇన్‌ఫామ్‌ చేయాలనే అంశం ఆధారంగా పోరాడుతున్నారు. చంద్రబాబును తొలగించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. అయితే తెలుగు దేశం వారు మాత్రం స్పీకర్ కు కాకుండా గవర్నర్ కు అధికారం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై సీఐడీ కింద కోర్టులో తోసి పుచ్చింది.

మూడు నాలుగు నెలల్లోనే చెప్పాలని మాత్రమే ఉంది. తన పర్మిషన్ తీసుకోవాలని మాత్రం లేదు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఇలాంటి వాదనలే వినిపిస్తే దాన్ని కోర్టు అప్పుడు కొట్టి వేసింది. 17 (ఏ) ప్రకారం.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని అంటే అక్కర్లేదని హైకోర్టు కొట్టి వేసింది. అయితే బెయిల్ రావాలంటే మాత్రం అనారోగ్య కారణాలను చూపి తీసుకోవడానికి వీలుంటుంది. ప్రాథమిక ఆధారాలు లేకపోతే బెయిల్ వస్తుంది. త్వరలోనే క్వాష్ పిటిషన్ ద్వారా తేలిపోతుంది.

సూర్య నారాయణ ఉద్యోగ సంఘం నేత తన అరెస్టు కు ప్రయత్నిస్తే యాంటిస్పెటరీ బెయిల్ తీసుకున్నారు. కింద కోర్టు, హైకోర్టు కొట్టి వేస్తే సుప్రీం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. అనంతర రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి తన పత్రికలో ప్రచురించింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉద్యోగ సంఘం నేత కేఆర్ సూర్య నారాయణ ముందస్తు బెయిల్ గురించి వాదనల సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే రాష్ట్రంలో బెయిల్ రాకపోతే చివరకు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: