పిల్లలు చెప్పినట్టు.. పెద్దలు వినాల్సిందేనా?

పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం  తల్లిదండ్రులకు ఉంటుంది. అదే అమ్మాయిల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ప్రత్యేకించి మన భారతీయులు. కానీ విదేశీ సంస్కృతి దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలో  అనే దాని గురించి కూడా కోర్టులు తీర్పును ఇస్తూ ఉంటాయి. అయితే కాలిఫోర్నియాలో ఇలాంటి స్టేట్మెంట్ నే ఇచ్చింది అక్కడి కోర్టు.


పిల్లల లింగమార్పిడికి అంగీకారం తెలపకపోతే ఆ పిల్లల  సంరక్షణను తల్లితండ్రులు కోల్పోయే విధంగా కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఒక బిల్లును తీసుకువస్తుంది. దాని ప్రకారం పిల్లలు తమకు  ఎలా ఉండాలని అనుకుంటే అలానే  ఉండనివ్వాలని లేదంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది అన్నట్లుగా ఒక బిల్లును తీసుకు  రాబోతుంది కాలిఫోర్నియా కోర్టు. ఒక అబ్బాయి అమ్మాయి తరహాలో పెరగాలనుకుంటున్నా, అదే సమయంలో  ఒక అమ్మాయి అబ్బాయి తరహాలో ఉండాలని అనుకుంటున్నా వాళ్లు  వాళ్ల కోరిక ప్రకారం వారికి నచ్చినట్లుగా ఉండొచ్చు.


వారికి వారి తల్లిదండ్రుల నుండి ఎటువంటి బలవంతం ఉండకూడదు.  అలానే ఎటువంటి ప్రమేయం ఉండకూడదు. వాళ్లని  ఇష్టం వచ్చినట్లుగా ఉండనివ్వాలని, వాళ్లకి గైడ్ గాని కౌన్సిలింగ్ గాని ఇవ్వకూడదు అని అక్కడి కోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ కోర్టు మాటను పక్కనపెట్టి వారు వారి పిల్లల విషయంలో కల్పించుకుంటే వాళ్లని అక్కడి కోర్టు తీసేసుకుంటుందని తెలుస్తుంది.


సరిగ్గా పిల్లలను ఏ వయసులో అయితే జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందో, సరిగ్గా అదే సమయంలో వారిని రెస్ట్రిక్ట్ చేస్తుంది అక్కడి కోర్టు.  ఎన్నో విలువలతో కూడింది భారతదేశ సమాజం. అయితే నేటి యుగంలో  విలువలతో కూడిన సమాజంలో, పెంపకంలో పెరగవలసిన యువత ఎక్కువగా విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోతుంది. ఫ్యాషన్ పేరుతో, విదేశీ కల్చర్ పేరుతో ఇప్పుడు  చిన్నతనం నుండే విదేశీ సంస్కృతి పెరిగిపోతున్న సందర్భంలో మన చట్టాలు కూడా ఆ రకంగా మారిపోతే  ప్రమాదమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: