జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

ఆంధ్రాలో వచ్చే ఏడాది జరగబోయే ఎలక్షన్స్ లో ఏం జరగబోతుందనే దానిపై ఇక్కడ ఏ పార్టీ లెక్కలు వాళ్లకు ఉన్నాయని తెలుస్తుంది. మొదటగా వైఎస్సార్సీపి లెక్క ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే వాళ్లు భారతీయ జనతా పార్టీకి ఓటు వెయ్యరని లెక్క వేస్తుంది. అలాగే జనసేన విషయంలో కూడా అదే జరుగుతుందని అనుకుంటుంది.

అంతే కాకుండా జనసేన పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ దెబ్బకొట్టాలనుకుంటాడని, అదే విధంగా తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన వాళ్లు దెబ్బ  కొట్టాలని అనుకుంటారని లెక్క వేసుకుంటుంది వైసిపి. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ,  జనసేన వర్గాల వాళ్ళు కొట్టుకుంటారని దాని ఫలితంగా వైసీపీకి గెలుపు సునాయాసం అవుతుందని వైసిపి అధిష్టానం అలాగే వైసిపి శ్రేణులు అందరి అభిప్రాయం.

ఇక తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ప్రకారం తమకు ఎలాగూ 40 శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ వల్ల మరో 10 శాతం ఓట్లు కలుస్తాయని లెక్క వేస్తుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మరో 5 శాతం కూడా కలుస్తాయని అనుకుంటుంది. అలా మొత్తం కలిపి 55% వరకు ఓట్లు వచ్చేస్తాయని లెక్క వేస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం తాను సపోర్ట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమని తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు కాబట్టి తనకు సముచిత స్థానాన్ని ఇస్తారని అనుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ తో కూడా పొత్తు కలిపేది తానే కాబట్టి తనకు సీఎం పదవి షేరింగ్ కూడా ఇస్తారని ఆయన లెక్క వేస్తున్నారు. ఇక బిజెపి తెలుగుదేశం పార్టీతో వెళితే నాలుగు ఎంపీ సీట్లు కలుస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చివరికి ఆంధ్రాలో వైసిపి వర్సెస్ తెలుగుదేశం కూటమి అన్నట్లుగా ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: