జగన్‌ సారూ.. పోలీసుల ఇబ్బందులు వింటున్నారా?

పోలీసు శాఖలో ఇప్పుడు నైట్ బీట్ అలవెన్స్ తీసేశారని సమాచారం. గతంలో సైకిల్ అలవెన్స్ ఇచ్చే వారట. అంటే పోలీసులు వాళ్లకు నిర్దేశించిన ప్రాంతాల్లో సైకిల్ మీద నాఖా బంది అంటే నైట్ బీట్ చేయాలి. అలా చేసినందుకు సైకిల్ అలవెన్స్ ఇచ్చేవారట. ఇప్పుడు సైకిల్ కి బదులు మోటార్ సైకిల్ ఇస్తున్నారు. వాటి మీద నైట్ బీట్ చేస్తూ ఉండాలి. అయితే గతంలో సైకిల్ అలవెన్స్ అని ఇచ్చేదాన్ని కాస్త మోటార్ సైకిల్ అలవెన్స్ గా ఇవ్వాల్సి ఉంది.


అయితే సైకిల్ అలవెన్స్ తీసేసారు గానీ మోటార్ సైకిల్ అలవెన్స్ ఇంకా ఇవ్వడం లేదని సమాచారం. అయితే అసలు అది ఎందుకు ఇవ్వడం లేదనే విషయాన్ని హోం శాఖ అలాగే డిజిపి కూడా పట్టించుకోవాలని అంటున్నారు. అది టెక్నికల్ ప్రాబ్లమా లేదా మరొకటా అనేది వాళ్ళు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలీస్ శాఖ వారికి ఇచ్చే జీప్ అనేది ఆ ఏరియాలను చూసే ఎస్ఐ చేతికే అప్పగిస్తారు. దాంట్లోనే ఆయన తరచుగా నైట్ రౌండ్స్ వేస్తూ ఉంటారు.


ఇక కానిస్టేబుల్స్ రెగ్యులర్ గా వారి దారిలో వారు తిరుగుతూ ఉండాలి. లేదంటే దొంగలకు పోలీసులు భయం పోయి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ ఇలా వారికి కావలసిన అలవెన్సులు ఇవ్వకపోవడంతో పోలీసులు వాళ్ళ సొంత వాహనాల్లో సొంత ఖర్చులతో తిరిగే అవకాశం అయితే ఉండదు. ఆల్రెడీ నక్సల్స్ ఏరియాలో వర్క్ చేసే పోలీసులకు కూడా అలవెన్సులు తీసేసారని సమాచారం.


అలాగే పోలీసులకు ఇచ్చే 10 పర్సెంట్ అదనపు హెచ్ఆర్ఏ అనేది కూడా తీసేసారని సమాచారం. అంటే రిస్క్ అలవెన్స్ తీసివేయడమే తప్పు అనుకుంటుంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అలవెన్సులు కూడా తీసేయడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. ఇప్పుడు పోలీస్ శాఖ వారికి ఇవ్వాల్సిన అలవెన్సులు ఇచ్చి వారి డ్యూటీని వాళ్లని చేసుకొనివ్వడం మంచిదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: