శభాష్‌ జగన్‌.. సర్కారు బడులు అదుర్స్‌?

ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు బడులు మారుతున్నాయి. నాడు నేడు కార్యక్రమంలో సర్కారు బడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వసతులతో పాటు మెరుగైన విద్య అందించడానికి కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు అందించే విద్యలో మార్పులు చేస్తుంది. అదే సమయంలో టీవీ ల రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది.


ఆంధ్రప్రదేశ్‌లో గతంలో బ్లాక్ బోర్డు నుంచి చాక్ పీసుల ద్వారా నేర్పిన పాఠాలు నేడు డిజిటల్ క్లాస్ రూమ్ ల వరకు మార్పు చెందాయి. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇంకా అమలు కావడం లేదు. విద్యాశాఖ కార్యదర్శి  ప్రవీణ్ దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించి దాదాపు ఆంధ్రాలోని పావు శాతం పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. తద్వారా గవర్నమెంట్ స్కూళ్లలో కూడా మెరుగైన విద్య కార్పోరేట్ స్థాయి విద్యను అందించగల సామర్థ్యాన్ని ఆయా పాఠశాలలు సాధించాయి.


దాదాపు 100 పాఠశాలలో 25 పాఠశాలలకు ప్రస్తుతం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విధానంలో పాఠాలు చెప్పేందుకు అవకాశం కలుగుతుంది. దీన్ని సమర్థంగా ఉపయోగించుకొని పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. నాడు నేడులో చేస్తున్న ఒక గొప్ప పనిగా దీన్ని వారు చెబుతున్నారు. ఒకప్పుడు మెరుగైన విద్య ఆంగ్ల బోధన టెక్నికల్ నాలెడ్జ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే చాలా విషయాలు గవర్నమెంట్ స్కూల్లో ఉండేవి కాదు.


మారుతున్న కాలానుగుణంగా ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ క్లాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టీవీ ద్వారా క్లాసులు చెప్పడం లాంటివి చేయడంతో విద్యార్థులకు కూడా తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. జగన్ ప్రభుత్వం సర్కార్ బడులపై పెట్టిన దృష్టి పూర్తిగా కొనసాగించి మిగతా పాఠశాలల్లో కూడా దాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నాడు నేడుతో మారుతున్న పాఠశాలలే దీనికి నిదర్శనం అని సర్కారు చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: