తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ ఇవ్వబోతున్న ఈటల?

తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అనేది ఇప్పటి వరకు కలగానే మిగిలిపోయింది. బీసీలకు కాస్త హై ప్రయార్టీ ఇచ్చిన పార్టీ టీడీపీ. 2014 ఎన్నికల సమయంలో టీడీసీ బీసీ అభ్యర్థి కృష్ణయ్యను తెలంగాణలో ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి అనుకున్న మెజార్టీ రాలేదు. టీడీపీలో దేవేందర్ గౌడ్,తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు బీసీ నేతలుగా ఎదిగారు.


గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలా మంది లీడర్లు బయటకొచ్చారు. టీడీపీ బీసీల పట్ల చూపిన విధానంతో చాలా మంది నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు సీఎంగా బీసీలు ఎవరూ చేయలేదు. ప్రస్తుతం బీజేపీ ప్రస్తుతం టీడీపీ  స్ట్రాటజీనే అనుసరిస్తోంది.


ముఖ్యంగా బీజేపీ తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించింది. పరోక్షంగా చాలా మంది ఈటలను సీఎం క్యాండిడేట్ అని అనుకుంటున్నారు. ఈటల బీసీ నేత. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా అన్ని రకాలుగా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ లో చర్చ మొదలైంది.


కాంగ్రెస్ లో సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తద్వారా కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 17 ఎంపీ టికెట్లలో 3 ఎంపీ టికెట్లు బీసీలకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ప్రస్తుతం బీజేపీ ఈటల రాజేందర్ ను తెరపైకి తెచ్చిన ఈ తరుణంలో బీసీలు ఏకపక్షంగా ఎక్కడ బీజేపీకి తరలిపోతారోనని చేస్తున్న కుట్ర అని కొందరు. బీసీలకు కాంగ్రెస్ దగ్గర కావడానికి కావాలనే కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను తెరపైకి తెచ్చారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా బీసీలకు ఈ సారి రెండు జాతీయ పార్టీలు మంచి ప్రయార్టీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: