హిందూయిజాన్ని విశ్వవ్యాప్తం చేసిన మోదీ?

అమెరికా పర్యటనలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజీబీజీగా గడిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మోదీ కొన్ని బహుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఇండియా ప్రధాని కూడా ఇలాంటి గిప్ట్ లు ఇవ్వలేదు. భారత దేశ సనాతన సాంస్కృతికత తెలిసేలా వినాయకుడి విగ్రహన్ని బహుమతి ఇచ్చాడు. పురాతన కాలంలో రాగి రేకుల మీద రాసిన విధానాన్ని అమెరికాకు తెలిసేలా రాగి రేకులపై దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఆయుర్వేద విధానాలు ఎలా రాశారో  దాన్ని బహుమతిగా ఇచ్చారు.


దేశం అంటే పురాతన, సనాతన, హిందూ సంప్రదాయాలను తెలిపేలా ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేశమని చాటి చెప్పేలా చేశారు. దీన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మోదీ ఇండియాకు కూడా వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు వచ్చినపుడు అందరూ చూపించిన విధంగా తాజ్ మహాల్ కాకుండా ఇండస్ట్రీయల్ లో దేశం ఎలా మెరుగుపడింది. సనాతన హిందూ ఆలయాలు, దాని నిర్మాణాలు,భారతీయుల జీవన విధానం, వారు ఏళ్ల కింద ఎలా గడిపారనే వివరాలను వారికి తెలియజేస్తున్నారు.


దీంతో ఇప్పటి వరకు ఇండియా అంటే పేద దేశం అనుకునే వారు సైతం ఎప్పుడో ఎన్నో ఏళ్ల కిందటే చరక సంహిత లాంటి గ్రంథం ఉందని, చాణక్యుడి నీతి సూత్రాలు ఉన్నాయని, మనిషి అనారోగ్యానికి గురైతే ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకునే వారని తెలుసుకుంటున్నారు . ఇండియా అనేది పేద దేశం కాదని ఒకప్పుడు దేశంలో అన్ని రంగాల్లో నిష్ణాతులు ఉండేవారని చెప్పడంతో మోదీ సక్సెస్ అవుతున్నారు.


కానీ కాంగ్రెస్ హయాంలో ఇండియాకు ఎవరైనా ప్రజా ప్రతినిధులు వస్తే వారికి పాములు పట్టే వారిని చూపించే వారని, కొరడాలతో దెబ్బలు కొట్టుకునే వారిని చూపించే వారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మహా అయితే తాజ్ మహాల్ చూపించేవారు. కానీ ఇండియా అంటే తాజ్ మహాలే కాదు అంతకు మించి అని చెప్పడంలో ప్రధాని మోదీ విజయం సాధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: