కామన్ సివిల్ కోడ్: దేశంలో మరో రచ్చ మొదలైందా?
అయితే కామన్ సివిల్ కోడ్ ద్వారా మత ప్రాతిపదికన కాకుండా రాజ్యాంగం ప్రకారం పెళ్లి చేసుకున్న మహిళలు దేశంలో ఎవరైనా సరే సంతానం విషయంలో చట్టం చెప్పినట్లు వినాలనేది ప్రముఖమైన అంశం. కానీ ముస్లిం మత పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. జమేత్ ఉలేమా చీప్ హర్షద్ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల 1300 ఏళ్లుగా ఇస్లాం మతం ప్రకారం ఆచరిస్తున్న సంప్రదాయాలు మంటలో కలిసిపోతాయని ముస్లింలకు ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశమని చెబుతున్నారు.
అయితే దీనిపై కొంతమంది పాతిక వేల సంవత్సరాల నుంచి భారత దేశ చరిత్ర ఉంది మరి దాన్ని అమలు చేయాలని మరో మతం కోరితే అప్పుడు ఏంటి పరిస్థితి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. రామాయణం, త్రేతాయుగం, ద్వాపర యుగం ప్రకారం అలాంటి చట్టాలు అమలు చేయాలని హిందువులు కోరితే అప్పుడెలా.. క్రిస్టియన్ మతం వారు తమ మతానికి అనుగుణంగా ఉండాలని కోరితే ఎలా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
ఇలా కామన్ సివిల్ కోడ్ అంశంలో కేవలం ముస్లిం మతానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయని చెప్పడం సరికాదని చెబుతున్నారు.అయితే దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని దీని వల్ల ఏ మతానికి ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం హామీ ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. మరి కామన్ సివిల్ కోడ్ అమలవుతుందా లేదా చూడాలి.