పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొన్ని విషయాల్లో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో ఉన్నాడని ఆ పార్టీ వారు చెప్పుకుంటున్నారు. కానీ పవన్ ఎక్కడా ఆ విషయం చెప్పినట్లు కనిపించడు. తెలుగుదేశం నుంచి ఎవరైతే బీజేపీలోకి వచ్చారో వారికి కొన్ని నియోజకవర్గాలను కేటాయించి అక్కడ ప్రచారం చేయించడంలో బీజేపీ విఫలమవుతోంది.

సుజనా చౌదరి, పురందేశ్వరీ, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో కొనసాగుతున్నారు. మరి వీరిని ఆంధ్ర బీజేపీ ప్రచారం చేయించడంలో వెనకంజ వేస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. వీరందరికీ కొన్ని నియోజకవర్గాలు అప్పజెప్పి వారితో ఆయా నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, లేదా పాదయాత్ర చేయించడం ద్వారా బీజేపీ ప్రజలకు దగ్గర కావచ్చు. కానీ అలాంటి ఆలోచన ఏదీ లేకుండా పవన్ కల్యాణ్ ను నమ్ముకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పురందేశ్వరీ, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ను కోస్తాంద్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రచారం చేయించాలి. కానీ వారిని సరిగా వాడుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకతను అందిపుచ్చుకుని కొంతలో కొంత శాతం మెరుగుపడవచ్చు. కానీ దాన్ని కూడా తీసుకోలేక బీజేపీ వెనకబడిపోతుందన్నది నిజం.

ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో మీరే క్యాండిడేట్ అని ఒకరిని నియమించి ప్రచారం చేయిస్తే సరిపోతుంది. పొత్తు అంశం తేలే వరకు తామే అభ్యర్థులు అని మనస్పూర్తిగా పనిచేస్తారు. ఒక వేళ పొత్తు కుదిరితే అందులో ఎవరికైనా ఇస్తే అప్పుడు అభ్యర్థులకు నచ్చజెప్పొచ్చు. ఇట్లా ప్లాన్ చేసుకోకపోతే ఏ చంద్రబాబునో పవన్ కల్యాణ్ నో నమ్మి ఎన్నికలకు వెళితే బీజేపీ ఒరిగేది ఏదీ ఉండదని ఇప్పటికీ గుర్తించపోవడం ఆంధ్ర బీజేపీ నాయకుల పొరబాటేనని  రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: