బాబును అయోమయంలో పడేస్తున్న పవన్?
ముందుగా అనుకున్నట్లు జనసేన, టీడీపీ ఒక పొత్తు, లేదా జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం మరో అంశం. రెండు కాకుండా వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అందులో జనసేన భాగం. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల కొంత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు సీఎం జగన్ ను ఓడించడమే లక్ష్యం అని దాని కోసం ఎంత వరకు కిందకు వెళ్లాల్సిన వెళతానని ప్రకటించిన పవన్, ప్రస్తుతం తనను గెలిపించాలని దాంతో పాటు జనసేనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. అంటే దీనర్థం టీడీపీతో పొత్తు లేనట్లే కనిపిస్తోంది. మరి జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా? దాని పైన కూడా క్లారిటీ లేదు.
ఒక్క సారిగా పవన్ వచ్చి మొత్తం రాజకీయాలను మార్చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ మద్దతు ఎలాగైనా ఉంటుందని అనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొత్తుల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. మరి పవన్ ఏ పార్టీని ఆదరిస్తారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే సానుభూతి పెరిగి ఓట్లు పడే అవకాశం ఉండేది. మరి పవన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ సానుభూతి ఉండకపోవచ్చు. చేసిన పనులు తప్ప రాజకీయం చేసి గెలుద్దామనుకున్న జగన్ ఆశల్ని ఒక్క మాటతో తేల్చి పడేశాడని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.