మణిపూర్‌ అల్లర్ల వెనుక ఆ దేశం హస్తం?

మణిపూర్ లో ఇటీవల హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది చనిపోయారు. దాదాపు 800 మంది గృహాలు కూడా ఈ ఘటనలో అగ్నికి అహుతయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే మయన్మార్ తో మణిపూర్ కు దాదాపు 400 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అయితే పెద్దగా ఫెన్సింగ్ గానీ భద్రత గానీ ఉండదు. ఎవరూ పడితే వారు ఇష్టమొచ్చినట్లు బార్డర్ దాటి వచ్చేస్తారు.

ఇక మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది. మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి దగ్గర ఆయుధాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆ ఆయుధాలతో వారు మయన్మార్ లోకి అడుగుపెట్టి కుకి వర్గానికి వ్యతిరేకంగా వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుకి సామాజిక గిరిజన వర్గానికి చెందిన వారిపై దాడులకు దిగుతున్నట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీంతో కుకి తెగ, మరో తెగ మధ్య తీవ్రంగా పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అస్సాం రైఫిల్స్ దళానికి వ్యతిరేకంగా నిరసన కారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆర్మీ సైనికుల మీదనే దాడులకు దిగడం పెద్ద సంచలనంగా మారింది.

మణిపూర్ ట్రైబల్ ఫోరం కుకి తెగ పై దాడులకు కేంద్రమే ప్లాన్ వేసిందని రెచ్చగొట్టేలా చేస్తోందని సుప్రీం కోర్టులో కేసు వేశారు. మైనార్టీ కుకి గిరిజనులకు సైన్యం ద్వారా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు మణిపూర్ లో 40 రోజులుగా ఘర్షణలకు కారణమని ఆరోపించింది. దాదాపు 100 మందికి మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మణిపూర్ లో శాంతి నెలకొల్పేందుకు అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్ష నేతలందరిని మణిపూర్ లో పర్యటించేలా అనుమతించాలని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే మణిపూర్ లో మొదట్లో అల్లర్లు చెలరేగి మధ్యలో ఆగాయి. మళ్లీ పరిస్థితి మొదటికి రావడంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: