కొత్త ఆయుధాలు: జర్మనీతో భారత్‌ కీలక ఒప్పందం?

భారత్ లో ఈ మధ్య జర్మన్ దేశానికి చెందిన మంత్రి పర్యటించారు. అదే రోజు మరో పక్క అమెరికా విదేశాంగ మంత్రితో మీటింగ్ జరుగుతుండగానే జర్మన్ మంత్రి కూడా ఇండియా పర్యటించడం విశేషం. అయితే  అమెరికా, జర్మన్ మంత్రులతో మీటింగ్ వేరు వేరుగా జరిగాయి. భారత దేశం ఆ మధ్య కాలంలో ఆరు సబ్ మెరైన్లు కావాలని జర్మనీని అడిగింది. జర్మనీ నుంచి కొనుక్కోవాలని భావించింది.  

ఆ సమయంలో ప్రాన్స్ కూడా మా వద్ద కొనుక్కోవాలని భారత్ ను అడిగింది. అయితే భారత్ ఒక కండిషన్ పెట్టింది. సబ్ మెరైన్ తయారీలో ఇప్పటికే తయారైన ఒకటి రెండు సబ్ మెరైన్ లను పంపించాలని భారత్ జర్మన్ ని కోరింది. మిగతా వాటిని మాత్రం జర్మనీలో కాకుండా ఇండియాలోనే తయారు చేయాలని ప్రతిపాదనలు చేసింది. తద్వారా ఇండియాలో కూడా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని ప్రకటించింది. ఇది మొత్తం 43 వేల కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టు. దీంతో జర్మన్ డైలామాలో పడి మరో 1000 డాలర్లు తగ్గిస్తాం.

కానీ జర్మన్ లోనే తయారు చేస్తామని చెప్పడం, లేదు ఇండియాలో నే తయారు చేయాలని భారత్ పట్టుబట్టడంతో ఆ ప్రాజెక్టు విషయం అక్కడితోనే ఆగిపోయింది. ఈ విషయంలో మరో సారి అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం జర్మన్ మంత్రి ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో అనేక అంశాలపై చర్చించుకున్న తర్వాత మరుగున పడిపోయిన ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

దీని ద్వారా ఇండియాలో సబ్ మెరైన్ తయారీ చేపడితే చాలా మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా సరికొత్త టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం ఇండియా యువతకు వస్తుంది. ప్యూచర్ లో మరిన్ని సబ్ మెరైన్లు తయారు చేసుకునే అవకాశం భారత్ అందిపుచ్చుకుంటుంది. కానీ జర్మన్ దేశం దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందోననే వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: