కిరాణా కొట్టు మాయం.. అంతా డిజిటల్‌మయం?

కిరాణా సరుకుల కొనుగోలు పద్ధతి అనేది గత కాలం నాటికీ, ఇప్పటికీ చాలా మారింది అని తెలుస్తుంది. గతంలో  మనం ఒక షాప్ కి వెళ్లి మనకి కావాల్సినవి లిస్ట్ చెప్తే అవి వాళ్ళు రాసుకుని ఎక్కువ వస్తువులు అయితే తర్వాత రమ్మనే వారు. లేదు అంటే తక్కువ వస్తువులు అయితే అప్పటికప్పుడు కట్టి ఇచ్చేసేవారు. లేదంటే ఇంటి దగ్గరే మనం ఆల్రెడీ రాసుకున్న సరుకుల లిస్ట్  వాళ్లకి ఇస్తే వాళ్లు కూర్చోమని అలాగే కట్టి ఇచ్చేసేవారు.

లేదంటే ఆ షాపు వాళ్లు తమ మనుషులతో ఇళ్ళకు పంపించేవారు అవసరమైన వాళ్లకి. ఆ తర్వాత రాను రాను సూపర్ బజార్లు వచ్చాయి. అక్కడ మనకు కావలసింది మనమే సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత బిల్లును కట్టడం అనేది జరుగుతూ ఉండే ప్రాసెస్ అది. రిలయన్స్ మార్ట్, డిమార్ట్ ఇలాంటివన్నీ ఈ కోవలోకే చెందినవి. అయితే ఈ సూపర్ బజార్ పద్ధతి ఒక పక్కన కొనసాగుతూనే ఉంది. మరో పక్కన ఇంటర్నెట్ ఎకానమీ పద్ధతిలోకి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ పద్ధతిలో ఏదైనా వస్తువులు మన ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకొని అది డోర్ డెలివరీ అయిన తర్వాత పేమెంట్ చేయవచ్చు. లేదంటే ముందుగానే పే చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ ఎకానమీ పద్ధతి ఇప్పుడు ప్రపంచమంతా విస్తృతమవుతుంది. ఇప్పుడు దాని మార్కెట్ లక్ష కోట్ల డాలర్ల వరకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ కామర్స్ విభాగం సపోర్టుతో దేశీయ ఇంటర్నెట్ ఎకానమీ 2030 సంవత్సరం నాటికి ఆరింతలు పెరిగేలా ఉంది అని లెక్కకడుతున్నారు.

అయితే ఈ లాభాల లెక్క ఇప్పుడు ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని వ్యాపార విశ్లేషకులు చెప్తున్నారు. గూగుల్ డెమో సెట్ బ్రెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ లెక్కలు బయటపడ్డాయని తెలుస్తుంది. భవిష్యత్తులో చాలా వరకు కొనుగోళ్ళు ఇలా డిజిటల్ పద్ధతిలోనే కొనసాగనున్నాయని నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: