బాబూ.. ఉచిత పథకాలు.. ఓట్లు రాలుస్తాయా?

అసలు సంక్షేమ పథకాలు అనే వాటి వల్ల ప్రజలకు  లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే దానికి సమాధానం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే దానికి సమాధానం ఖచ్చితంగా ఎటు తేల్చలేని పరిస్థితి అయితే ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రాలు, కేంద్రాలు నాశనం అయిపోతాయని, ప్రజలు వీటి వల్ల పాడైపోతారు అని చెప్పిన వాళ్లు కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇస్తామని చెప్పడం ఒక విచిత్రం.

ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాలు పథకం నుండి కొన్నిటిని సేకరించి మరీ, వాళ్ళు కూడా ప్రజలకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యాక్చువల్ గా  ఈ సంక్షేమ పథకాలు ఎవరికి అవసరం అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి ధనికులు ఇంకా మధ్య తరగతి వాళ్లకి కూడా అవసరం ఉండవు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పేదలకు మాత్రమే ఈ సంక్షేమం పథకాలు వర్తించాలని ఇప్పుడు వాళ్లు చెప్పినటువంటి సందర్భం.

కానీ ఇక్కడ మధ్యతరగతి వాళ్ళని కూడా పేదవాళ్లలో కలిపేసి వాళ్లకి కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని అంటున్నారు. ఆకాశాన్ని అంటే భవనాల ముందు రోడ్డుకి ఒక మూలన విసిరేసినట్లు ఉండే గుడిసెల్లో నివసించే పేదలకు ఇలాంటి పథకాలు ముఖ్యంగా అందాలని వాళ్లు భావిస్తున్నారు. నిజానికి పనులు చేయలేని వారికి, ఇంకా పనులు చేసినా దానికి తగిన ప్రతిఫలం రాని వాళ్ళకి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అందిస్తే బాగుంటుందని ఈ విశ్లేషకుల సలహా.

వారికి ఏడాదికి ఇంత అని సంక్షేమ పథకాలను ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి చేసిన వాళ్లవుతారు. ఉదాహరణకి ధనవంతులకి డబ్బు గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ ల మీద ఫ్లాట్లు  కొంటారు. అదే మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కొనాలంటే అప్పు తీసుకుని అయినా కొంటారు. కానీ ఈ రెండు చేయలేని పేదల గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: