
సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?
డీకే శివకుమార్ వైపు ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట నిజమే. కానీ ఎంత డబ్బులు పెట్టి ప్రయత్నించినా ఫలితం రాబట్టుకోలేకపోయారని అంటున్నారు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నా సరే పర్సన్ టు పర్సన్ వాళ్ళని సర్వే చేసినప్పుడు వాళ్లలో 80% మంది సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపించారు అన్నట్లుగా తెలిసింది. దాంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీతో పాటు, సోనియా గాంధీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారట.
ఈ విషయంపైనే రాహుల్ గాంధీ డీకే శివకుమార్ తో ఒక గంట పైనే చర్చించారట. అయితే దీనికి అప్పుడైతే రాహుల్ తో డీకే శివకుమార్ సరేనని చెప్తూనే మల్లికార్జున్ కార్గే దగ్గరకు వెళ్లి ఇదే ప్రతిపాదనను తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రజల అభిప్రాయానికే ఎక్కువ మద్దతునిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజాభిప్రాయం ప్రకారం సిద్ధరామయ్య తమకు ముఖ్యమంత్రి కావాలన్నది వాళ్ళ ఉద్దేశం అని తెలుస్తుంది.
కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలంటే సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యని, డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ని ప్రకటించింది. డీకే శివ కుమార్ చివరి వరకూ పోటీ ఇచ్చినా చివరకు హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి కర్ణాటక కథ సుఖాంతం అయ్యింది.