అయ్యయ్యో.. అమెరికాలో మనోళ్ల కష్టాలు?

అమెరికాలో ఎన్ఆర్ఐలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఇండియాకు తిరిగి వచ్చేస్తున్న వారి సంఖ్య కూడాా ఎక్కువగానే ఉంది. చాలా మంది కోట్ల రూపాయలకు ఉద్యోగం చేేసే వ్యక్తులు లక్షలకే చేస్తున్నారు. చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభంలో ఎంతో మంది భారతీయులకు తీవ్రమైన కష్టాలనే తెచ్చి పెడుతోంది.

ఈ కష్టాల వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియాకు రాలేక, అమెరికాలో తక్కువ జీతానికి పని చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు. 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లిన వారు లక్షల్లో సంపాదిస్తే చాలు ఇక్కడ ఎకరాలకు ఎకరాలు భూమి కొనేసేవారు. దీంతో అటు జీతం.. ఇటు కొన్న భూమికి వాల్యూ పెరిగేది. దాదాపు రెండు మూడు లక్షలకు ఒక ఎకరం భూమి దొరికేది. కానీ కాలం మారింది. ఇండియాలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో  భూముల ధరలు పెరిగాయి. ఇప్పుడు అక్కడ లక్షల్లో సంపాదించిన ఇక్కడ భూములు కొనలేని పరిస్థితి.

చివరకు సుడాన్ లాంటి పేద దేశంలో కూడా దాదాపు 3400 మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎక్కవ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ.  పెద్ద ఉద్యోగాలు చేసి  ఎక్కువగా సంపాదించాలనే కోరికతో వెళుతుంటారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మంది సుడాన్ లో ప్రస్తుతం చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి ఇండియాలో ఉద్యోగాలు దొరక్క కాదు. ఎక్కువ సాలరీ వస్తుందనే ఆశతో విదేశాలకు వెళుతున్నారు. కడపు చంపుకొని మరీ డబ్బులు సంపాదిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అమెరికా లాంటి దేశంలో ఉద్యోగాలు పోవడం అనేది ఇబ్బందికరమైన అంశం. ముఖ్యంగా భారతీయులను ఉద్యోగాల నుంచి ఎక్కువగా తీసేస్తున్నారు. ఇండియాలో ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చినా ఉద్యోగాలకు ఢోకా లేదని అదానీ సంస్థలను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎన్ ఆర్ఐలు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nri

సంబంధిత వార్తలు: