ఏపీ పరువు తీస్తున్న వివేకా హత్య-రాజకీయాలు?

ఆంధ్రప్రదేశ్ మర్డర్, రాజకీయం, అవినీతి అనే కేస్ స్టడీగా తీసుకోవచ్చని, ఇది న్యాయవాదులకు, పోలీసులకు, కచ్చితంగా ఉపయోగపడుతుందని చంద్రబాబు మూడు జిల్లాల పర్యటనలో విమర్శలు చేశారు. అయితే వీరికే కాదు రీసెర్చ్ చేసే వారికి, పీహెచ్ డీ చేసేవారికి ప్రపంచ వ్యాప్త పరిశోధకులకు కూడా ఆంధ్ర ఇపుడు కేస్ స్టడీగా మారిందని చెప్పొచ్చు. ఏమీ లేని ప్రాంతంలో  29 గ్రామాల పరిధిలో కోటి జనాభాతో రాజధాని కడతామనడం నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా తీసుకోవాల్సిన కేస్ స్టడీ.

అయితే అయిదు శాతం పేద వారు మాత్రమే బతికే నగరాన్ని సృష్టించాలనుకోవడం ఒక కేస్ స్టడీ. వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగ్గొట్టి ప్రజా ప్రతినిధులుగా దర్జాగా తిరుగుతున్నారు. వారిది కేస్ స్టడీగా తీసుకోవాలి. ఇక్కడ బాధపడాల్సిన అంశం ఏమిటంటే చిన్న చిన్న తప్పులు చేసి ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిది మరో అంశం. ఒకరి సంస్థల్లో పెట్టుబడులు పెడితే నేరం. మరోక సంస్థలో పెడితే నిజం. నిజాయతీగా  మాట్లాడే వారిపై లేని పోని నిందలు వేసి వారిని బయటి ప్రపంచంలో తలదించుకునేలా చేస్తున్న కొందరి నైజం కేస్ స్టడీ.

ఒక మర్డర్ చేసి నేను ఇప్పుడు మారిపోయాను అని బహిరంగంగా బయటకు చెబుతున్న వ్యక్తి గురించి నిజంగా తెలుసుకోవడం ఒక కేస్ స్టడీ. జర్నలిజంలో అనుకూల పార్టీలకు మంచిగా వార్తలు రాస్తూ, వ్యతిరేక పార్టీలపై బురద చల్లే వార్తలు రాయడం కూడా ఒక కేస్ స్టడీ.

విదేశాల్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఇక్కడి రాజకీయ నాయకులకు మద్దతు పలుకుతూ అనేక రకాల పోస్టులు చేస్తుంటారు. అయితే రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.  ప్రతి విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరిని చూసి మరొకరు విమర్శలు చేసుకుంటూ ఇలాంటి కేస్ స్టడీ చేసుకోవాలని ఎద్దేవా చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: