సూడాన్‌లో యుద్ధం.. ఇండియాలో రాజకీయం?

రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఆరంభం కాకముందు అక్కడ ఉండే పౌరులకు భారత ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. వీలైనంత తొందరగా ఇండియాకు వచ్చేయాలని కోరింది. త్వరలోనే యుద్ధం ప్రారంభమవుతుందని తెలిపింది. దీన్ని లెక్క చేయకుండా చాలా మంది అక్కడే ఉండిపోయారు.

పర్యవసానం చివరకు యుద్ధం ప్రారంభమై దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్వయంగా మాట్లాడి మూడు రోజులు యుద్ధాన్ని ఆపించి భారత పౌరులను వెనక్కి తీసుకురాగలిగారు. అనంతరం ఉక్రెయిన్ మొత్తం యుద్ధాన్ని ఆపాలని భారత్ ను వేడుకుంది. కానీ అది సాధ్యం కాకపోవడంతో భారత్ పై తీవ్ర విమర్శలు చేసింది. కావాలనే యుద్ధాన్ని ఆపడం లేదని అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరుల్ని వేధించింది.

భారత దౌత్యధికారులు చెప్పినట్లు ముందుగానే అందరూ ఇండియాకు వచ్చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ భారత అధికారులు అసలు ఏం చెప్పనట్లు ఇన్పర్మేషన్ కూడా ఇవ్వనట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రస్తుతం సుడాన్ లో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భారత దౌత్య వేత్తలు చాలా సార్లు అక్కడ ఉండే ఇండియన్స్ కి సందేశాలు పంపారు. యుద్ధం జరిగే అవకాశం ఉంది. వెంటనే తిరిగి వచ్చేయాలని కోరారు. కానీ ఇప్పటికీ అక్కడే చాలా మంది ఉండిపోయారు. దీంతో చేసేదేమీ లేక అక్కడే ఉండాలని ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచనలు చేశారు.

దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కర్ణాటక నుంచి వెళ్లిన 30 మంది కూలీలు సుడాన్ లో చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. దీనికి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, సిద్ధ రామయ్యకు ఇలాంటి విషయాలపై ఏ మాత్రం అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: