అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, లేదా ఏ ప్రాంతంలోనైనా సరే ప్రజలు ఏ పార్టీకైనా సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోతే అక్కడ అరాచకం తాండవిస్తుందని చెప్పలేం గానీ, అవినీతి తాండవిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉండాలి, అలా డబ్బులు ఇవ్వాలంటే అవినీతి చేస్తూ ఉండాలి. అలా అవినీతి చేయాలంటే ప్రజల దగ్గర్నుంచి చేయాలి. ప్రజల సొమ్ముల్ని అడ్డంగా దోచేస్తేనే కదా అది అవినీతి అవుతుంది.

కర్ణాటకలో 40 సంవత్సరాలుగా ఎన్నడూ సింగిల్ గా గెలిచింది లేదు. ఎప్పుడూ మద్దతుతోనే గెలుస్తుంది. అందుకని కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ చేతిలోకి పోతుంది. అంతకు ముందు జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కొంతమందిని చీల్చుతుంది. బిజెపి నుంచి కొంత మందిని చీల్చుతుంది. డబ్బులు ఇచ్చే కదా చేసేది. కిందటిసారి ఏమైంది కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ బిజెపికి ఫుల్ మెజార్టీ రాలేదు 104వచ్చాయి. అప్పుడు ఏం చేసింది జెడిఎస్ కి మద్దతునిస్తూ, జెడిఎస్ నుండి సీఎం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది.

కానీ ఏడాదిన్నర లోగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. డబ్బులు చాల్లేదు, మంత్రి పదవిలు చాల్లేదని గొడవలు వచ్చాయి. మళ్లీ వాళ్ళలోంచి ఓ పాతిక మంది బిజెపిలోకి వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ వాళ్లందరికీ డబ్బులు ఇవ్వాల్సిందే కదా. అది ఒకటి జరిగింది. మళ్లీ పదవులు కూడా ఇవ్వాల్సి వచ్చింది. సొంతోళ్ళకి కాదనుకొని వాళ్లకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ అసంతృప్తి ఒక పక్కన ఉంది.

ఇప్పుడు జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణం ఏర్పడితే ఆ తర్వాత రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గనుక, అది కొనసాగుతుంది. అదే కనుక కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందంటే గనుక ఒక ఏడాది తిరిగే లోగా క్రిందటి సారి లాగే మళ్లీ వాళ్ళిద్దరిలోంచి కొంతమందిని చీల్చుకుని వీటిలోకి చేర్చుకుంటారు. ఈసారైనా స్థిరత్వం వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: