వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

భారత్ కు ఒక పక్క పాకిస్థాన్ మరో పక్క చైనాతో సరిహద్దుల గొడవలు ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండేందుకు భారత్ రాకెట్ దళాన్ని మరింత దృఢంగా తయారు చేసుకుంటోంది. భారత్ కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు చైనాలో ఉన్నాయి. ఎక్కువ మోతాదులో దాడులు చేయగల మిస్సైల్స్, అణు బాంబులు సైతం చైనా తయారు చేసి పెట్టుకుంది. అందుకే భారత్ కొత్త తరహా రాకెట్ లను తయారు చేయడానికి ప్లాన్ చేసింది. అణ్వస్త్రాలను మోసుకు వెళ్లే క్షిపణులు తయారు చేయడానికి రూ. 7500 కోట్లను మంజూరు చేసింది. ఇవెక్కడో తయారు కావడం లేదు. ఇండియాలో నే వీటిని తయారు చేయనున్నారు.

విదేశీ కంపెనీలు వీటిని తయారు చేస్తున్న ఇవి భారత్ లోనే తయారు కావడం గమనార్హం. వీటి సామర్థ్యం 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఏ స్థావరాన్ని అయినా ఛేదించగల లక్ష్యం వీటి సొంతం. అలాంటి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడానికి భారత్ ఇప్పుడు ముందుకొచ్చింది. చైనా నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియని సమయంలో ముందు జాగ్రత్తగా ఉండటానికే ఇలాంటి క్షిపణులు తయారు చేసి పెట్టుకుంటున్నారు.

చైనా, పాకిస్థాన్ రెండు కలిసి ఎటాక్ చేసినా వాటిని తట్టుకుని ముందుకెళ్లాలంటే అంతటి సామర్థ్యం ఉన్న మిస్సైల్స్ మన సొంతమవ్వాలి. ఇలా ప్రతి దాంట్లో ముందుంటేనే రెండు దేశాలను ఎదుర్కొగలం. ఇలా అణ్వస్త్రాలను మోసు కెళ్లగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు ఇండియాలో తయారు కావడం హర్షించాల్సిన విషయం. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏడాదిగా యుద్ధం సాగుతోంది. వివిధ దేశాలపై ఆధార పడిన ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదే సొంతంగా ఆయుధ సామగ్రి మనదైతే శత్రవుతో పోరాటం చేసేందుకు చాలా అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: