ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దాదాపు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో ఉండనున్నాయి. దీనికి సంబంధించి జనవరి నుంచే ముమ్మరంగా ప్రయత్నాలు మొదలవుతాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే 6 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో టీడీపీకి తలనొప్పిగా మారనుంది. ఇదే పార్టీలో ఇద్దరు, ముగ్గురు ఆశా వహులు ఉంటే, ఇంకా టీడీపీతో పొత్తుల కోసం పోటీపడుతున్న వారు చాలా మందే ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా గెలిచిన వారు ఉన్నారు. ఆయా  నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆశావహులు రెడీగా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు అభ్యర్థుల విషయంలో ఎలాంటి ఢోకా లేదు. జనసేన పవన్ కల్యాణ్ మాత్రం అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటినుంచే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తారనే వివరాలను ప్రజలకు చెబుతూ వారిని నియోజకవర్గాల్లో తిప్పితే బాగుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో అభ్యర్థి పేరు, వివరాలు చెప్పి ఈయన జనసేన నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబితే ప్రజలకు  ఇప్పటి నుంచే ఆ క్యాండేట్ ఓకేనా కాదా అనేది నిర్ణయించుకోవడానికి సమయం ఇచ్చిన వారవుతారు. ఒక వేళ కాదు కూడదు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థిని కూడా  మార్చుకోవచ్చు.

జనసేన లోకల్ లీడర్లు వైసీపీ వారిపై ఎటాకింగ్ చేస్తున్నా అక్కడ టికెట్ వస్తుందా లేదా అనే సస్పెన్స్ తో ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక ఆయా నియోజకవర్గాల్లో  తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల విషయంలో ముందంజలో ఉంటే జనసేన మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో స్పష్టత లేనట్లుగానే కనిపిస్తోంది. ఇది జనసేన పార్టీ నాయకులకు ఏం చేయాలో తోచని పరిస్థితిలా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: