నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

తైవాన్ జలాల్లోకి ఇంకా తైవాన్ బఫర్ జోన్ లోకి కూడా యుద్ధ విమానాలు, యుద్ధనౌకలు పంపించినటువంటి చైనా 3రోజుల్లో విన్యాసాలు ముగించింది. కానీ జింపింగ్ ఆ సైన్యంతో మాట్లాడినటువంటి ప్రసంగమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఆయన ఏమన్నారంటే  మీరు ఇప్పుడు దాకా చేసిన విన్యాసాలు యుద్ధ విన్యాసాలు, అసలైన యుద్ధానికి సిద్ధమవ్వమని ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనానికి దారితీస్తుంది. గతంలో 2చోట్ల గొడవ జరిగినప్పుడు కూడా ఇట్లాంటి ఉపన్యాసాలే ఇచ్చారు. కానీ తర్వాత చూస్తే ఏమీ లేదు.

అయినా ఇప్పుడు మరోసారి ఉపన్యాసం ఇచ్చిన సందర్భంలో ఇది కూడా పబ్లిసిటీ స్టంటా లేకపోతే నిజంగా యుద్ధానికి సిద్ధమవ్వమంటున్నాడా అనేదే చర్చనీయాంశం అవుతుంది. తిరిగి యుద్ధం చేసే నిమిత్తం శిక్షణను బలోపేతం చేయాలని  జింపింగ్ సైన్యానికి చెప్పారు.  అతను నేవీస్ సదరన్ థియేటర్ కమాండర్ కి ఇలా చెప్పాడు. చైనా ప్రభుత్వ మీడియా సీ.సీ.టీవీ ప్రకారం, చైనా యొక్క ప్రాదేశిక సార్వభౌమాధికారం మరియు సముద్ర ప్రయోజనాలపై సైన్యం దృఢంగా ఆధారపడి ఉండాలని జింపింగ్ చెప్పారు.

దక్షిణ చైనా సముద్రాలలో ఈ వారంలో అమెరికా మరియు ఫిలిప్పీన్స్ అతిపెద్ద సైనిక డ్రిల్‌లను నిర్వహిస్తున్నందున తైవాన్‌ను భయపెట్టడానికి బీజింగ్ సైనిక కసరత్తులు నిర్వహిస్తుంది. తైవాన్‌ను బెదిరించేందుకు బీజింగ్ మిలటరీ డ్రిల్‌లు నిర్వహించిన తర్వాత యు.ఎస్, చైనా ఎదురయ్యాయి.
ఇక్కడ విశేషమేమిటంటే చైనా ఎప్పుడైతే వీళ్ళతో కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తుందో ఆ పక్కనున్నటువంటి  ఫిలిప్పీన్స్ తో కూడా అమెరికా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో దానికోసం చెప్పారా అన్న వాదన వినిపిస్తోంది.

లేకపోతే ఒక పాసింజర్ మార్కా అంటే, అవును ఇది పాసింజర్ మార్కే అని నిపుణులు చెప్తున్నారు. లేదు ఆయన చెప్పింది యుద్ధ హెచ్చరికలే అని వేరే రకమైన నిపుణులు చెప్తున్నారు. చూద్దాం జింపింగ్ మనసులోని మర్మమేమిటో, మాటలోని అంతరార్థం ఏమిటో, మెదడులోని ఆలోచన ఏమిటో కార్యరూపంగా వచ్చేవరకు కూడా కరెక్ట్ గా తెలియకపోవచ్చు అని  వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: